Jaane Jaan Review: మూవీ రివ్యూ : జానేజాన్ ఎలా ఉందంటే?

కలింపాంగ్ లో జీవించే ఒంటరి తల్లి మాయ డిసౌజా అలియాస్ సోనియా డిసౌజా చుట్టూ ఈ కథ నడుస్తుంటుంది. ఈ కూతురు బాధ్యతలు చూసుకోవడానికి ఒక కేఫ్ లో పనిచేస్తుంటుంది తల్లి.

  • Written By: Suresh
  • Published On:
Jaane Jaan Review: మూవీ రివ్యూ : జానేజాన్ ఎలా ఉందంటే?

Jaane Jaan Review: కరీనా కపూర్ నటించిన జానే జాన్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హెయిగో హిగాషినో రాసిన జపనీస్ నావెల్ ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ ని బేస్ వచ్చిన సినిమానే జానే జాన్. జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ ఇందులో కీలక పాత్రలు చేసారు. సుజోయ్ ఘోష్ తెరకెక్కించిన ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? కరీనా రేంజ్ కు తగ్గ సినిమానా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్టోరీ..
కలింపాంగ్ లో జీవించే ఒంటరి తల్లి మాయ డిసౌజా అలియాస్ సోనియా డిసౌజా చుట్టూ ఈ కథ నడుస్తుంటుంది. ఈ కూతురు బాధ్యతలు చూసుకోవడానికి ఒక కేఫ్ లో పనిచేస్తుంటుంది తల్లి. అయితే మయా కి తన భర్త అజిత్ మాత్రే అంటే ఇష్టం ఉండదు. దీంతో కూతురు పుట్టకముందే భర్తతో విడిపోతుంది.ఈమె ఇంటి ప్రక్కన ఉండే నరేన్ వ్యాస్ ఆమెపై మనుసు పారేసుకుంటాడు. అదేనండి ప్రేమిస్తుంటాడు. బ్లూ మూన్ నుంచి అజిత్ మ్హత్రే సడన్ గా కాలింపాంగ్‌ కి వస్తాడు. అంతే కాదు ఆ ఇల్లును కూడా చూస్తాడు. కానీ ఆయన డబ్బు కోసం వచ్చాడు అని పొరపాటు పడుతుంది మాయ. కానీ అనుకొని పరిస్థితుల వల్ల కూతురితో కలిసి భర్తను చంపేస్తుంది మాయ. ఈ హత్యకు సహాయం చేస్తాడు నరేన్. అసలు మయా ఎందుకు తన భర్త ని చంపింది, మరి మాయా, నరేన్ ఈ హత్యతో పోలీసులకు చిక్కుతారా, ఆపైన కథ ఏవిధంగా మలుపు తిరిగింది అనేది కథ.

ప్లస్ పాయింట్స్
జైదీప్ అహ్లావత్ తన నటనా నైపుణ్యాలతో ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకుంటాడు. ఇక కరీనా కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటనతో మరో సారి సూపర్ అనిపించుకుంది. కీలక సన్నివేశాలతో పాటు లాస్ట్ 40 నిమిషాల్లో ఆమె నటన టోటల్ సినిమాకి ప్రధాన హైలైట్ గా చెప్పుకోవాలి. ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ కి చిన్న టౌన్ సెటప్ తో వేసిన సెట్ ఎంతో బాగుంది. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వర్మ సూపర్ గా పెర్ఫార్మన్స్ చేసారు. ఆయన భిన్నమైన పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

మైనస్ పాయింట్స్ :
హెయిగో హిగాషినో రాసిన జపనీస్ నావెల్ ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ ని బేస్ చేసుకుని జానే జాన్ తెరకెక్కినప్పటికీ ఇది గతంలో వచ్చిన క్రైమ్ యాక్షన్ మలయాళం మూవీ దృశ్యం కి కొంత ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. ఇందులో చంపిన వ్యక్తిని దాచి పెట్టడానికి ప్రయత్నించే తీరు దృశ్యం సినిమాను తలపిస్తాయి. ఆ ప్రాసెస్ జరుగుతున్నంత సేపు ఈ సినిమానే గుర్తుకు వస్తుంది. అన్ని భాషల్లో దృశ్యం సినిమా వచ్చింది కాబట్టి ఏ భాషలో చూసినా కూడా సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది పెద్ద నెగటివ్ అనే చెప్పాలి. కానీ జాన్ జాన్ లో పాత్రల యొక్క ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో పాటు చివరి పోర్షన్ సీన్స్ మాత్రం భిన్నంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ స్లో గా సాగుతుంది, ఎడిటింగ్ టీమ్ కొన్ని సీన్స్ ని కట్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. అంతే కాదు అసలు కొన్ని ప్రశ్నలకు సమాధానం చివరివరకు కూడా ఉండదు. సమాధానం లేకుండానే సినిమా ముగుస్తుంది. అయితే అజిత్ మాత్రే పాత్ర మరింత క్లుప్తంగా రాసి ఉంటే బాగుండు.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు