BRO – Jaanavule : ‘బ్రో’ నుండి ‘జానవులే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల.̣.వెరైటీ ట్యూన్ తో అదరగొట్టిన థమన్!
ఇకపోతే ఈరోజు ఈ చిత్రం లోని సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన పాట ‘జానవులే’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాటకి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

BRO – Jaanavule : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని చకచకా విడుదల చెయ్యడం ప్రారంభించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘మై డియర్ మార్కండేయ’ కి ప్రారంభం లో చాలా డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రెండవ రోజు నుండి మాత్రం చిన్నగా సాంగ్ పిక్ అయ్యి , రోజు రోజుకి మిలియన్ల కొద్దీ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇకపోతే ఈరోజు ఈ చిత్రం లోని సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన పాట ‘జానవులే’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు.
కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాటకి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాములుగా థమన్ సంగీత దర్శకత్వం నుండి ఒక పాట విడుదల అవ్వగానే, ఈ సాంగ్ ని ఎక్కడో విన్నామే, ట్యూన్ ఎక్కడి నుండో కాపీ కొట్టాడు కదా ? అంటూ పోల్చి చూస్తూ నెటిజెన్స్ సోషల్ మీడియా ని దద్దరిల్లిపోయేలా చేసేవారు. కానీ ఈ సాంగ్ కి ఎలాంటి వంకలు పెట్టే విధంగా లేదు. చాలా ఫ్ర్ష్ ట్యూన్ తో సూతింగ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు థమన్.
ఇక ఈ లిరికల్ వీడియో సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ తో పాటుగా కేతిక శర్మ కూడా కనిపించింది. సాయి ధరమ్ తేజ్ కంటే కూడా ఎక్కువగా ఆమెనే డ్యాన్స్ వేసింది. యాక్సిడెంట్ అయ్యినప్పటి నుండి సాయి ధరమ్ తేజ్ సరిగా డ్యాన్స్ వెయ్యలేకపోతున్నాడు. మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి నెగటివ్ రెస్పాన్స్ రావడానికి కారణం సాయి ధరమ్ తేజ్ అని చెప్పొచ్చు. ఇకపోతే కాసేపటి క్రితమే విడుదలైన ఈ పాట ని మీరు కూడా వినేయండి.
