Relationship: కష్టంగా కలిసుండడం కంటే బ్రేకప్ చెప్పడం మేలు.. ఎందుకంటే?
ప్రేమ లేదా పెళ్లి ద్వారా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒక్కటవుతారు. తమ భిన్న మనస్తత్వాలతో కలిసి జీవిస్తారు. ఒకరు ఒకరి మనస్తత్వాన్ని మరొకరు అర్థం చేసుకొని భాగస్వామి తమకు వ్యతిరేకంగా ఉన్నా సర్దుకుపోతూ ఉంటారు.

Relationship: ప్రేమ ఏ క్షణాన పుడుతుందో ఎవరూ చెప్పలేం. లవ్ ఇన్ ఫస్ట్ సైట్ అన్నట్లు తొలిచూపులోనే ప్రేమ పుట్టే అవకాశం ఉంటుంది. ఆ తరవాత ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి శాశ్వత బంధంగా మారుతుంది. అయితే నేటి కాలంలో చాలా బంధాలు ఆకర్షణతోనే ఒక్కటవుతున్నాయని, వారి మధ్య ప్రేమ ఉండడం లేదని కొందరు మానసిక నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్నాళ్ల పాటు ప్రేమించుకొని లేదా పెళ్లి చేసుకొని వెంటనే విడిపోతున్నారు. అయితే బలవంతంగా, కష్టంగా కలిసి ఉండడం కంటే విడిపోయి ఎవరికి వారు హాయిగా జీవించడమే మేలంటున్నారు. ఇలా బ్రేకప్ చెప్పుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. వాటి గురించి పరిశీలిస్తే..
ప్రేమ లేదా పెళ్లి ద్వారా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒక్కటవుతారు. తమ భిన్న మనస్తత్వాలతో కలిసి జీవిస్తారు. ఒకరు ఒకరి మనస్తత్వాన్ని మరొకరు అర్థం చేసుకొని భాగస్వామి తమకు వ్యతిరేకంగా ఉన్నా సర్దుకుపోతూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం ఎవరికి వారే తమ పెత్తనం చెలాయించాలి అన్నట్లు ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో కపుల్స్ మధ్య మనస్పర్థలు వస్తాయి. ఆ తరువాత గొడవలు ఏర్పడుతాయి. తదనంతరం ప్రేమతో అప్పటి వరకు కలిసున్నవారు విడిపోవడమే ఎంతో మంచిదని ఫీలవుతారు.
తొలిచూపులోనే ప్రేమ పుట్టినట్లుగా మనసులో ఒక్కసారి విడిపోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు వెంటనే బ్రేకప్ చేసుకోవడమే మంచిదంటున్నారు మానసిక నిపుణులు. కష్టంగా కలిసి ఉండడం కంటే విడిపోయి హాయిగా ఉండడమే మంచిదంటున్నారు. బ్రేకప్ చేసుకోవడం వల్ల మనసులో ఒక స్పష్టత వస్తుంది. ఆ తరువాత ఏం చేయాలనే అనే దానికి మార్గం ఏర్పడుతుంది. బ్రేకప్ ఎందుకు చెబుతున్నామో తేలితే ఆ తరువాత ఎంచుకోబోయే వ్యక్తిలో అలాంటి లక్షణాలు ఉంటే తమకు షూట్ కాదనే భావన ఏర్పడుతుంది.
కష్టంగా కలిసి ఉండడం వల్ల మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఈ సమస్య గుండె వరకు వెళ్తుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే బ్రేకప్ చెప్పుకొని ప్రశాంతంగా జీవించడం మేలని అంటున్నారు. బ్రేకప్ వల్ల మనలో తెలియని కొత్త కోణం బయటపడుతుంది. దీంతో ఆ తరువాత జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి కొత్తగా ఆలోచిస్తుంటాం. అంతేకాకుండా ఆ వ్యక్తి గురించి ముందే ప్రణాళికలు వేసుకుంటాం.
