Gaddam Vivek: బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన వీ6 అధినేతపై ఐటీ రైడ్స్.. మాజీ నేతను వదలని బీజేపీ..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.

Gaddam Vivek: ఎంతటి అవినీతిపరులైనా బీజేపీలో చేరితే పవిత్రమైపోతారు అని దేశవ్యాప్తంగా చాలాకాలంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఈ ప్రచారం మరీ ఎక్కువ. మొన్నటి వరకు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న బీఆర్‌ఎస్ నేతలు ఐతే ప్రధాని, హో మంత్రి హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ తరహాలో.. వాషిగ్‌పౌడర్ బీజేపీ అని పెద్దపెద్ద పోస్టర్లు, ఫెక్లీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అది నిజమే అన్నట్లుగా ఉంది ఇప్పుడు వీ6 అధినేత, బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వివేక్ వెంకటస్వామి ఇళ్లై ఐటీ రైడ్స్ చూస్తుంటే. మొన్నటి వరకు బీజేపీలో ఉన్నప్పుడు అక్రమాస్తులు గానీ, అవినీతిగానీ కనిపించలేదు. కాంగ్రెస్‌లో చేరగానే అక్రమాస్తులు బీజేపీకి కనిపించాయి. ఇంకేముందు ఎన్నికల వేళ.. సదరు ఆజీ నేతపై ఐటీరైడ్స్ మొదలు పెట్టింది. మారుమూల జిల్లా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇళ్లపైనా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
పతాక స్థాయికి ప్రచారం..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలందరూ. ఈ పరిస్థితుల్లో మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు మళ్లీ పంజా విసిరారు. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి జి.వివేకానంద, బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇళ్లతోపాటు అనుచరుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.
చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్..
వివేక్ మొన్నటి వరకు బీజేపీలోనే ఉన్నారు. పక్షం రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన మంచిర్యాల్ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో మంగళవారం తెల్లవారు జాము నుంచి ఆయన ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నూరులోని వివేక్ నివాసంతో పాటు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి. వివేక్ బంధువులు, కొందరు ముఖ్య అనుచరుల ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలకు దిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 ఈ దాడులు సాగుతున్నట్లు సమాచారం. పార్టీ మారిన అతి కొద్ది రోజుల్లోనే ఐటీ అధికారులు వివేక్ ఇంటిపై దాడులకు దిగడం.. రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
సిర్పూర్ అభ్యర్థి కోనప్ప..
ఇక సిర్పూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనప్ప ఇప్పటికే రెండుసార్లు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయనకు బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇటీవలో మావోయిస్టుల పేరిట ఓ లేక కోనప్పపై విడుదలైంది. మరోవైపు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ కోనప్పపై కేసు పెట్టించారు. ఇలా ముప్పుతిప్పలు పడుతున్న ఆయనపై తాజాగా ఐటీరైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఆయనతోపాటు ఆయన అనుచరుల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ రైట్స్ మొదలయ్యాయి. దీంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
