చంద్రబాబు మెడకు చుట్టుకున్న ఐటీ ఉచ్చు

టీడీపీ హయాంలో చంద్రబాబు పాలనలో లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒకవైపు అమరావతిలో మనీల్యాండరింగ్ బాగోతం టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతుండగా.. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి చిట్టా బయటకు వస్తుంది. తాజాగా ఐటీ దాడుల్లో 2వేల కోట్ల బాగోతం బయటపడ్డది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, కడప పుణే వంటి 40 చోట్ల గత ఆరు రోజులుగా చంద్రబాబు పిఏ పై జరుగుతున్న ఐటీ సోదాలలో విస్తు గొలిపే విషయాలు బయట పడుతున్నాయి. భారీ […]

  • Written By: Neelambaram
  • Published On:
చంద్రబాబు మెడకు చుట్టుకున్న ఐటీ ఉచ్చు

టీడీపీ హయాంలో చంద్రబాబు పాలనలో లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒకవైపు అమరావతిలో మనీల్యాండరింగ్ బాగోతం టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతుండగా.. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి చిట్టా బయటకు వస్తుంది. తాజాగా ఐటీ దాడుల్లో 2వేల కోట్ల బాగోతం బయటపడ్డది.

హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, కడప పుణే వంటి 40 చోట్ల గత ఆరు రోజులుగా చంద్రబాబు పిఏ పై జరుగుతున్న ఐటీ సోదాలలో విస్తు గొలిపే విషయాలు బయట పడుతున్నాయి. భారీ నగదు కుంభకోణం, అధిక స్థాయిలో భూముల కొనుగోలు, కాంట్రాక్టర్ల విషయంలో బోగస్ టెండర్లు, వాటికి సంబంధించిన నోటీసులు వంటి అనేక కోణాలలో ఐటీ సోదాలు నిర్వహించి ఇప్పటికే కీలక పాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా తెలిపారు.

గతంలో మంత్రి ఉపసంఘం నివేదిక మరియు సిబిఐ ఇచ్చిన ఆధారాలతో టీడీపీపై కేసు పెట్టడం జరిగింది. 797మంది తెల్లరేషన్ కార్డు ఉన్న పేదల పేర్ల పై వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నట్లు సిబిఐ గుర్తించి, తగిన నివేదికను ఆధారాలతో సహా ఈడీకి అందజేసిన విషయం తెలిసిందే..

2014 జూన్ నుంచి డిశంబర్ మధ్య కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో దాదాపు 4వేల ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రి వర్గం నిగ్గుతేల్చింది. అందులో తెల్లరేషన్ కార్డు దారులు దాదాపు 760 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లు ఏసిబిఐ ఆధారాలు స్వీకరించింది.

సంబంధిత వార్తలు