Lavanya Tripathi: పెళ్ళయాక లావణ్య త్రిపాఠి చేయబోయే పని ఇదా? పరిశ్రమకు దూరంగా!
తెలుగులో ఆమెకు ఎలాంటి సినిమాలు లైనప్ లో లేవు. కోలీవుడ్ లో మాత్రం ‘థానల్’ అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఆమె పేరు మాత్రం మీడియా లో ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. దానికి కారణం ఆమె త్వరలోనే మెగా ఇంటికి కోడలుగా వెళ్లనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో రీసెంట్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
గతంలో హీరోయిన్ జ్యోతిక, మహేష్ బాబు భార్య నమ్రత లాగే లావణ్య కూడా సినిమాకు దూరంగా ఉన్న కానీ సినిమా రంగానికి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో లావణ్య కాస్త బచ్చీ లుక్ లో కనిపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తూనే ఆమెకు ఇక సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని సృష్టంగా తెలుస్తుంది.
తెలుగులో ఆమెకు ఎలాంటి సినిమాలు లైనప్ లో లేవు. కోలీవుడ్ లో మాత్రం ‘థానల్’ అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత ఏ సినిమాకు కూడా అగ్రిమెంట్ చేయలేదు లావణ్య. పెళ్లి తర్వాత పూర్తిగా భరతనాట్యం మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్ డేస్ నుండి భరతనాట్యం మీద మంచి పట్టున్న లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్’ సినిమాలో భరత నాట్యం చేసిన సంగతి తెలిసిందే.
చదువుకునే సమయంలో మిస్ ఉత్తరాఖండ్ పోటీలో విజేతగా నిలిచిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పుడు టాలీవుడ్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి గాండీవాధారి అర్జున సినిమా పూర్తి చేసి, తాజాగా మట్కా అనే కొత్త సినిమా ప్రారంభించి కెరీర్ లో టాప్ గేర్ లో దూసుకొని వెళ్తున్న మెగా ప్రిన్స్ కి సరైన ఒక్క హిట్ పడితే మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతారు. అలాంటి మెటీరియల్ ఉన్న నటుడు వరుణ్ తేజ్
