Scientists Create First Synthetic Embryos: సంపర్కం లేకుండా సంతానం.. ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తల ప్రయోగం

Scientists Create First Synthetic Embryos: జీవరాశి పుట్టుకకు స్త్రీ, పురుషుల పరస్పర సంపర్కం తప్పనిసరి, ఇది ప్రకృతి నియమం. కానీ ఇటీవల మనుషుల్లో చాలా మంది సపర్కానికి ఆసక్తి చూపడం లేదు. సంపర్కం జరిగినా పిల్లలు పుట్టని వారు ఎంతో మంది ఉంటున్నారు. ఇందుకు పురుషుల్లో సామర్థ్యం తగ్గిపోవడం, రేడియేషన్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఇతర వ్యాధులు ఇలా అనేక కారణాలతో పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లైంగిక కలయిక జరుగకుండానే సంతానం కలిగే […]

Scientists Create First Synthetic Embryos: సంపర్కం లేకుండా సంతానం.. ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తల ప్రయోగం

Scientists Create First Synthetic Embryos: జీవరాశి పుట్టుకకు స్త్రీ, పురుషుల పరస్పర సంపర్కం తప్పనిసరి, ఇది ప్రకృతి నియమం. కానీ ఇటీవల మనుషుల్లో చాలా మంది సపర్కానికి ఆసక్తి చూపడం లేదు. సంపర్కం జరిగినా పిల్లలు పుట్టని వారు ఎంతో మంది ఉంటున్నారు. ఇందుకు పురుషుల్లో సామర్థ్యం తగ్గిపోవడం, రేడియేషన్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఇతర వ్యాధులు ఇలా అనేక కారణాలతో పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లైంగిక కలయిక జరుగకుండానే సంతానం కలిగే ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు.

Scientists Create First Synthetic Embryos

Scientists Create First Synthetic Embryos

వీర్యంతో సంబంధం లేకుండా..
ఓ స్త్రీ కడుపు పండాలంటే.. స్త్రీ, పురుషుల కలయిక తప్పనిసరి అనేది ఒకప్పటి మాట. ఒకప్పుడు అందరికీ సాధారణంగా పిల్లలు ఇలానే పుట్టేవారు. కానీ.. మారుతున్న కాలాని తగినట్లు.. సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నవారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రకరకాల చికిత్సలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కలయికతో సంబంధం లేకుండా.. ఐవీఎఫ్‌ పద్దతి ద్వారా కూడా చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు అవుతున్నాయి. ఈ పద్ధతిలో శృంగారంతో సంబంధం లేకపోయినా… పురుషుల వీర్యం, స్త్రీ అండం తప్పనిసరి. అయితే.. తాజాగా ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో.. అసలు పురుషుల వీర్యం లేకుండా.. పిండాన్ని అభివృద్ధి చేశారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. కృత్రిమంగా పిండం తయారు చేయడమోలాగో వీరు ఆవిష్కరించారు. ఈ పద్దతిలో పురుషుల వీర్యంతో అసలు సంబంధమే ఉండదు.

Also Read: Chandrababu- BJP: చంద్రబాబుకు బీజేపీ స్నేహహస్తం.. మొత్తబడుతున్న కేంద్ర పెద్దలు

Scientists Create First Synthetic Embryos

Scientists Create First Synthetic Embryos

తల్లి గర్భం కూడా అవసరం లేదు..
ఐవీఎఫ్‌ విధానంలో అండం, వీర్యం కలిపి ఫలదీకరణ చెందిన తర్వాత దానిని తల్లిగర్భంగా ప్రవేశపెడతారు. ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కృత్రిమ పిండానికి తల్లి గర్భం కూడా అవసరం లేదు. ఓ చిన్న పాత్రలో ఓ సింథటిక్‌ పొరను ఏర్పరిచి.. అందలోనే తల్లి గర్భంలోని వాతావరణాన్ని రూపొందించి.. కేవలం రక్త కణాలతోనే ఓ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఇందులోనే కణజాలం వృద్ధి చెందడంతోపాటు.. శరీర భాగాలు కూడా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు. తాము చేసిన ఈ ప్రయోగానికి వీర్య కణాలతో కూడా సంబంధం లేదని చెప్పారు. ఇలా తల్లి గర్భం, తండ్రి వీర్యంతో సంబంధం లేకుండా కృత్రిమ పిండం రూపొందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా… మానవ కణజాలాన్ని, శరీర భాగాలను కృత్రిమంగా తయారు చేయడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read:Revanth Reddy- Congress Senior Leaders: కాంగ్రెస్ నుంచి అందుకే బయటకు.. ఇతర పార్టీల్లోకి వెళ్తూ రేవంత్ పై రాళ్లు

Tags

    follow us