Isha Ambani And Radhika Merchant: అంబానీ కూతురు, కోడలు మరీ.. ఖరీదైన బ్యాగుతో ఖతర్నాక్ వదినా మరదళ్లు.. ఆ హ్యాండ్ బ్యాగ్ ధరెంతంటే?
నీతా, ముఖేశ్ అంబానీ తనయ, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ, అనంత్ అంబానీ(ఇషా సోదరుడు అనంత్ రాధిక నిశ్చితార్థం జరిగింది) కాబోయే భార్య రాధిక మర్చంట్ ఇద్దరూ లేడీ డియోర్ మినీ హ్యాండ్‌బ్యాగ్‌లతో సందడి చేశారు.

Isha Ambani And Radhika Merchant: వెంట్రుకలు ఉన్న కొప్పు ఎటేసినా బాగానే ఉంటుంది అన్నట్లు.. సంపన్నులు ఏం చేసినా బాగానే అనిపిస్తుంది. ఇక ఆసియా కుభేరుడు అంబానీ ఫ్యామిలీ మహిళలంటే ఈ కథే వేరుంటుంది. ఈ విషయాన్నే రిలయన్స్ అధినేత, ఆసియా బిలియనీర్ ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ మరోసారి నిరూపించారు. లగ్జరీ బ్రాండ్ హ్యాండ్‌బాగ్‌తో కనిపించి ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ బ్యాగ్ ధర హాట్ టాపిక్‌గా మారింది.
ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌తో..
నీతా, ముఖేశ్ అంబానీ తనయ, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ, అనంత్ అంబానీ(ఇషా సోదరుడు అనంత్ రాధిక నిశ్చితార్థం జరిగింది) కాబోయే భార్య రాధిక మర్చంట్ ఇద్దరూ లేడీ డియోర్ మినీ హ్యాండ్‌బ్యాగ్‌లతో సందడి చేశారు. మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ తరచూ అనేక ఈవెంట్లకు హాజరువుతూ ఉంటారు. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ బ్యాగ్స్ ధరించి ది డియోర్ ఫాల్ 2023 షోలో పోజులిచ్చారు. డియోర్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతానికి ఈ బ్యాగు అందుబాటులో లేనప్పటికీ వీరిద్దరూ ధరించిన ఈ బ్యాగు ధర భారత కరెన్సీలో సుమారుగా రూ.21.06 లక్షలు.
వేడుకకు ప్రముఖుల హాజరు..
లగ్జరీ దిగ్గజం క్రిస్టియన్ డియోర్ లేటెస్ట్ ఈవెంట్ ఇటీవల ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాలో జరిగింది. ఈ ఫ్యాషన్ షోకు అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, సోనమ్ కపూర్, శోభితా ధూళిపాలా, మీరా రాజ్‌పుత్, అనన్య పాండే, ఖుషీ కపూర్, కరిష్మా కపూర్, డయానా పెంటీ, ఆథియా శెట్టి లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇంకా హర్షవర్ధన్ కపూర్, అనితా ష్రాఫ్ అడజానియా, శ్వేతా బచ్చన్, అర్జున్‌కపూర్, మసాబా గుప్తా, నటాషా పూనావల్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు బ్రిడ్జర్టన్ స్టార్ సిమోన్∙ఆష్లే, నటుడు పూర్ణ జగన్నాథన్, సంగీత విద్వాంసురాలు అనౌష్క శంకర్ ఇతర జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఫ్యాషన్ ఈవెంట్‌లో సందడి చేశారు. ఇదే ఈవెంట్‌లో వదిన మరదళ్లు ఇషా అంబానీ, రాధిక ఖరీదైన హ్యాండ్ బ్యాగుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
