
Mahesh-Trivikram Movie
Mahesh-Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అతడు మరియు ఖలేజా వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత వీళ్ళ కాంబినేషన్ నుండి వస్తున్న మూడవ సినిమా ఇది, దాంతో ఈ మూవీ పై ఫ్యాన్స్ లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అలా వైకుంఠపురం లో’ వంటి ఇండస్ట్రీ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు.
అలాగే మహేష్ బాబు వరుసగా హిట్టు మీద హిట్టు కొట్టి ఏ స్టార్ హీరో కూడా లేనంత పీక్ స్టేజి ఉన్నాడు. ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి కలిస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయని ట్రేడ్ వర్గాలు సైతం నమ్ముతున్నాయి. అందుకే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఇప్పటికే పలు ప్రాంతాలలో ప్రారంభం అయ్యింది.రాజమౌళి సినిమాకి ఎలా అయితే కళ్ళు మూసుకొని ఎంత చెప్తే అంత పెట్టి బయ్యర్స్ కొనుక్కుంటారో, ఈ చిత్రానికి కూడా అలాంటి డిమాండ్ ఉంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన రీసెంట్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.ఈ ఫోటో లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాతికేళ్ళు వెనక్కి వెళ్లినవాడిలా ఉన్నాడు. అంత అందం తో మెరిసిపోతున్నాడు. ఇక మహేష్ పక్కన త్రివిక్రమ్ మరియు జయరాం వంటి వారితో పాటు అలా వైకుంఠపురం లో సినిమాలో నటించిన నటీనటులంతా ఇందులో ఉన్నారు.
ఇదంతా చూసి అభిమానులు గురూజీ అల వైకుంఠపురం లో’ వంటి సినిమా తీస్తున్నాడా, లేదా అలా వైకుంఠపురం లో సినిమానే మళ్ళీ రీమేక్ చేస్తున్నాడా అనే సందేహాం లో పడ్డారు అభిమానులు. అదే సమయం లో ఆందోళన కూడా వ్యక్తపరిచారు.ఎందుకంటే రొటీన్ అనిపిస్తే జనాలు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజ హెగ్డే , శ్రీలీల నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఆగష్టు 11 వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం.