Kantara- Pushpa 2: ‘కాంతారా’ మరియు ‘పుష్ప 2 ‘ కి మధ్య ఇంత లింక్ ఉందా..డైరెక్టర్ సుకుమార్ తెలివికి జోహార్లు!
Kantara- Pushpa 2: ఈ మధ్య ఒక ప్రాంతానికి సంబంధించిన సంప్రదాయాలను హైలైట్ చేస్తూ సినిమాలు రావడం చాలా కామన్ అయిపోయింది. ఆ సినిమాలే ఇప్పుడు పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడించేస్తున్నాయి. గత ఏడాది విడుదలైన ‘కాంతారా’ సినిమా అలాంటిదే,ఆ చిత్ర దర్శకుడు తన గ్రామం తుళునాడు కి సంబంధించిన సంప్రదాయాన్ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించి చరిత్ర సృష్టించాడు ఆ చిత్ర హీరో/ దర్శకుడు రిషబ్ శెట్టి. అక్కడ ఆదివాసీయులు పుంజుర్లి దేవుడు […]


Kantara- Pushpa 2
Kantara- Pushpa 2: ఈ మధ్య ఒక ప్రాంతానికి సంబంధించిన సంప్రదాయాలను హైలైట్ చేస్తూ సినిమాలు రావడం చాలా కామన్ అయిపోయింది. ఆ సినిమాలే ఇప్పుడు పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడించేస్తున్నాయి. గత ఏడాది విడుదలైన ‘కాంతారా’ సినిమా అలాంటిదే,ఆ చిత్ర దర్శకుడు తన గ్రామం తుళునాడు కి సంబంధించిన సంప్రదాయాన్ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించి చరిత్ర సృష్టించాడు ఆ చిత్ర హీరో/ దర్శకుడు రిషబ్ శెట్టి.
అక్కడ ఆదివాసీయులు పుంజుర్లి దేవుడు ని పూజిస్తూ ప్రతీ ఏడాది మొహానికి పసుపు పూసుకొని, కిరీటం ధరించి , మేడలో మల్లెపూల దండ మరియు కనకాంబరాల దండలు ధరించి, కొబ్బరి ఆకులను ధరించి ‘ఊఁ’ అంటూ అరుస్తుంటారు.ఈ సంస్కృతి ని తెలుసుకోవడానికి ఆడియన్స్ కూడా అమితాసక్తిని చూపించారు. అందుకే చిన్న సినిమా గా విడుదలైన ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించి సుమారుగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Kantara- Pushpa 2
ఇక రీసెంట్ గానే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప : ది రూల్’ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రెండిటికి రెస్పాన్స్ అదిరిపోయింది కానీ, ఫస్ట్ లుక్ కి మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. చీర కట్టుకొని , చేతికి గాజులు తొడుక్కొని, చెవిలో దుద్దులు, ముక్క పుడకలు , మేడలో నిమ్మకాయల హారం ధరించి అల్లు అర్జున్ అందరినీ షాక్ కి గురయ్యేలా చేసాడు. ఈ చిత్రం తిరుపతి మరియు చిత్తూర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతాది అని విషయం అందరికీ తెలిసిందే. తిరుపతి జిల్లాలో జరిగే ముఖ్యమైన జాతరలలో ఒకటి గంగాళమ్మ జాతర.
అమ్మవారికి మొక్కు పెట్టుకొని మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకొని, ఉట్టి పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.చివరిగా దిష్టి తీసి ఆ ఉట్టిని పగలగొడుతారు. ఆ సంప్రదాయాన్ని ఈ చిత్రం ద్వారా తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాడట సుకుమార్.’కాంతారా’ మూవీ ని చూసిన తర్వాతే ఆయనకీ ఈ ఆలోచన వచ్చిందట. మరి కాంతారా కి కనెక్ట్ అయ్యినట్టు ఆడియన్స్ పుష్ప2 కి కనెక్ట్ అవుతారో లేదో చూడాలి.
