Congress: గెలిచే వేళ.. కాంగ్రెస్ తన చేత్తో తన కంటినే పొడుచుకుం టోందా?
కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియా కూటమి సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు తెరువెను భాగోతం తెలిశాక తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కూడా మనసు మార్చుకునే అవకాశం లేకపోలేదు.

Congress: తెలంగాణలో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పార్టీ పిలుపునిస్తే అసెంబ్లీకి స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావాహులు లెక్కకు మిక్కిలి దరఖాస్తులు చేసుకున్నారు. అధికార పార్టీ తప్పులను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలోని ఢిల్లీ పెద్దలు ఏపీ సీఎం జగన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామంతో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో సెటిలర్లు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇది అంతిమంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియా కూటమి సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు తెరువెను భాగోతం తెలిశాక తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కూడా మనసు మార్చుకునే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం అంటోనే సోనియా, రాహుల్, ప్రియాంక.. ఈ ముగ్గురికి రాజకీయం పెద్దగా తెలియదని ఢిల్లీ వర్గాలు అంటూ ఉంటాయి. అందుకే వారిని పార్టీకి చెందిన ఎంతో మంది తప్పుదోవ పెట్టించగలిగారు. వారి చుట్టూ ఉండే కొటరీలో అవినీతి పెరిగిపోయిందన్న ప్రచారం ఉంది. డబ్బు కట్టలు సమకూర్చగలిగితే ఈ కోటరీ ఆయా నివేదికలను తిమ్మిని బమ్మిని చేసి అధిష్ఠానం ముందు ఉంచుతుందనే అపవాదు ఉంది. జగన్ విషయంలోనూ ఇలానే జరిగి ఉంటుందనే వాదనలు ఉన్నాయి.
లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో పది రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలను ముందుకూ వెనక్కూ జరిపి డిసెంబరు లేదా వచ్చే జనవరిలో జరిపి డిసెంబరు లేదా వచ్చే జనవరిలో లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు జరిగే లోగా ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ ఆలోచనగా వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో రానున్న ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ అధికారింలోకి రావడం కష్టమన్న అభిప్రాయానికి రావడం వల్లే కాంగ్రెస్ పార్టీకి జగన్ ‘సంధి’ సందేశాన్ని పంపారనే అభిప్రాయాలున్నాయి. గత ఎన్నికల్లో అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉండేవారు. మోడీని వ్యక్తిగతంగా దూషించారు. ఫలితం అనుభవించారు. ఇప్పుడు జగన్ అలాంటి సాహసం చేయకపోయినా కాంగ్రెస్ పార్టీతో యుగళగీతం పాడేందుకు సిద్ధపడుతున్నారని ఢిల్లీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తన సోదరి షర్మిలను ఆటలో అరటి పండును చేశారనే అపవాదు ఉంది. మరి ఈనేపథ్యంలో షర్మిల ఏం చేస్తారనేది అంతుపట్టకుండా ఉంది.
