Anchor Rashmi : ఆ స్టాంప్ నే యాంకర్ రష్మీకి శాపమా.. సినిమా అవకాశాలు అందుకే రాలేదా?
వెళ్లిపోనని రష్మీ చెప్పింది. సినిమాలు చేస్తూనే టీవీ ప్రోగ్రాంలు కూడా చేస్తానని స్పష్టం చెప్పింది. దీంతో కార్యక్రమంలో ఉన్నవారంతా చప్పట్లతో అభినందించారు.

Anchor Rashmi : రష్మీగౌతమ్.. పరిచయం అక్కరలేని పేరు. టెలివిజన్ స్క్రీన్‌పై యాంకర్లు సుమ, అనసూయ తర్వాత అంతటి గుర్తింపు ఉన్న యాంకర్ రష్మీ. ముఖ్యంగా జబర్దస్ ప్రోగ్రాంతో రష్మీ బుల్లితెర ఆడియన్స్‌కు చాలా దగ్గరైంది. తెలుగు అమ్మాయే అయినప్పటికీ.. అచ్చిరాని తెలుగు మాటలు.. భాషలో దొర్లే తప్పులతో కామెడీ చేయడం ద్వారా సగటు టీవీ అభిమాని కూడా షర్మీని అభిమానిస్తున్నాడు. దీంతో టెలివిజన్‌రంగంలో మంచి పొజిషన్‌లో ఉంది. అయితే బుల్లితెర ఆధారంగా వెండితెర చాన్స్‌లు కూడా రష్మీకి వచ్చాయి. అయితే బుల్లితెరపై రాణించినంతగా వెండితెరపై రాణించలేకపోతోంది. ముఖ్యంగా అనసూయ వెండితెరపై మంచి చాన్స్‌లు కొట్టేస్తోంది. రష్మీ మూడు నాలుగు సినిమాలు చేసినా అనసూయలా గుర్తింపు మాత్రం రాలేదు.
