Prabhas: ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి రాజమౌళి భార్య కారణమా? ఈ సినిమా వెనుక అసలు కథ

ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ ల జాబితాలో మిర్చి సినిమా ముందు వరుసలో ఉంటుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పించింది.

  • Written By: Suresh
  • Published On:
Prabhas: ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి రాజమౌళి భార్య కారణమా? ఈ సినిమా వెనుక అసలు  కథ

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు హిట్ ను సొంతం చేసుకుంటే.. ఈ మధ్య మాత్రం డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ తో మరింత ఢీలా పడ్డారు ప్రభాస్. ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాల ఫలితాల కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ కెరీర్ మొత్తంలో బాహుబలి, మిర్చి సినిమాలు ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఈ సినిమాలు ఊహించని రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకొని అభిమానులను సంతోషపెట్టాయి.

ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ ల జాబితాలో మిర్చి సినిమా ముందు వరుసలో ఉంటుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పించింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటించడానికి రాజమౌళి భార్యనే కారణం అంట.. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఆమె చేసిన పని వల్లనే ప్రభాస్ ఈ సినిమాలో నటించారని తెలుస్తోంది. అయితే రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉందట. అదే సందర్భంలో ప్రభాస్ కు మిర్చి ఆఫర్ వచ్చింది.

ప్రభాస్, రాజమౌళి ఇద్దరు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా వాయిదా పడింది. ఈగ సినిమా త్వరగా పూర్తి చేయాలనుకున్నారట రాజమౌళి. ఈ సినిమా కోసం జక్కన్న రెండేళ్ల సమయం కేటాయించడంతో ప్రభాస్ ప్లాన్స్ కూడా మారిపోయాయి. దీంతో రాజమౌళి అనుమతితోనే లారెన్స్ డైరెక్షన్ లో రెబల్ సినిమాలో నటించారు ప్రభాస్. రెబల్ సినిమా షూట్ పూర్తైన తర్వాత కొరటాల శివ వినిపించిన మిర్చి కథ చాలా నచ్చిందట. అయితే బాహుబలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏ చేయాలో ప్రభాస్ కు పాలుపోలేదట.

ప్రభాస్ అయోమయం గురించి తెలిసిన రాజమౌళి భార్య రమా జక్కన్నతో సినిమా అంటే ఆలస్యం అవుతుంది. అందుకే మిర్చి సినిమా పూర్తి చేసుకొని ఆ తర్వాత బాహుబలి షూటింగ్ లో పాల్గొనమని సూచించిందట. ఇలా రమా రాజమౌళి సపోర్ట్ ఉండడంతో ప్రభాస్ మిర్చి షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు