Prince Yawar: ప్రిన్స్ యావర్ జీవితం ఇంత దుర్భరమా… అతని కథ వింటే కన్నీళ్లు ఆగవు!
అయితే ఎవరి స్తోమతకు తగ్గట్లు వాళ్లు ఉండొచ్చు. ఖచ్చితంగా ఖరీదైన బట్టలు ధరించాలనే నియమం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరైన ప్రిన్స్ యావర్ లుక్ చూస్తే అతడు సౌండ్ పార్టీ అనిపిస్తుంది.

Prince Yawar: బిగ్ బాస్ షో వరకు వచ్చారంటే వాళ్ళు సెలెబ్రిటీలు అనుకుంటాం. అదే సమయంలో వాళ్ళది లగ్జరీ లైఫ్. బాగా డబ్బున్నోళ్లే హౌస్లోకి వస్తారని భావిస్తాం. అయితే రియాలిటీ వేరు. అందరూ రిచ్ పీపుల్ కారు. సామాన్యులు, పేదవాళ్ళు కూడా ఉంటారు. అదే సమయంలో బిగ్ బాస్ షోకి వెళ్లాలన్నా కొంత డబ్బు కావాలి. వీకెండ్స్ మంచి డిజైనర్ బట్టలు ధరించాలి. తిండి, వసతి కాకుండా హౌస్ మేట్స్ అవసరాలన్నీ బయట నుండే రావాలి. కంటెస్టెంట్ కి కుటుంబ సభ్యులు ఇవన్నీ సమకూర్చాలి.
అయితే ఎవరి స్తోమతకు తగ్గట్లు వాళ్లు ఉండొచ్చు. ఖచ్చితంగా ఖరీదైన బట్టలు ధరించాలనే నియమం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరైన ప్రిన్స్ యావర్ లుక్ చూస్తే అతడు సౌండ్ పార్టీ అనిపిస్తుంది. బాగా డబ్బులున్న కుటుంబానికి చెందినవాడు అనుకుంటాం. అతని లుక్ కి ఆర్థిక స్థితికి పొంతన లేదని తేలిపోయింది. నిన్న ఎపిసోడ్లో తన కష్టాలు చెప్పుకొని యావర్ కన్నీరు పెట్టుకున్నాడు.
పవర్ అస్త్ర గెలవాలని యావర్ చాలా ప్రయత్నం చేశాడు. తనకు బిగ్ బాస్ కఠిన టాస్క్ ఇచ్చాడు. ముఖంపై పేడ, గడ్డి వేసినా కూడా చలించకుండా అలానే ఉండిపోయాడు. ఇంత కష్టపడితే… కంటెండర్ రేసులో ఉండేది లేనిది నిర్ణయించే ఆకాశం బిగ్ బాస్ పరోక్షంగా ప్రియాంక, శోభా శెట్టి చేతుల్లో పెట్టాడు. దీంతో యావర్ తీవ్రంగా నష్టపోయాడు. అతని ఆవేశం కట్టలు తెచ్చుకుంది. తన బొమ్మను సుత్తితో పగలగొట్టారు.
అనంతరం తన గోడు కంటెస్టెంట్ శివాజీ వద్ద వెళ్లగక్కాడు యావర్. నేను లోన్ తీసుకుని ఈ షోకి వచ్చాను. నా బ్యాంకు బ్యాలన్స్ జీరో. వంద రూపాయలు కూడా చేతిలో లేవు. ఆకలి నుండి పుట్టిన ఆవేశం నాది. ఎంత బాగా ఆడినా ప్రయోజనం లేకుండా పోతుంది. నాకు కేవలం మూడు ప్యాంట్లు ఉన్నాయి. వాటినే ఉతికి వేసుకుంటున్నాను. ఇంటి నుండి బట్టలు పంపమని కూడా నేను అడగను. నా పేరెంట్స్ ఆర్థిక స్థోమత నాకు తెలుసంటూ ఏడ్చేశాడు. శివాజీ నీకు కూడా టైం వస్తుందని ఓదార్చాడు. యావర్ ఆర్థికంగా ఇంత పేదవాడా అనే చర్చ జరుగుతుంది.
