NTR And Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఇన్ని దగ్గరి పోలికలా?

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు వారసత్వం తొనికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ మూడో తరం వారసుడు అయితే.. రామ్ చరణ్ మాత్రం రెండో తరం వారసుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు.

  • Written By: Suresh
  • Published On:
NTR And Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఇన్ని దగ్గరి పోలికలా?

NTR And Ram Charan: రెండు వేరు వేరు ఫ్యామిలీలు, కానీ స్టార్ డం సంపాదించారు. చేసే సినిమాలు వేరు కానీ హిట్ లు కొడుతారు. ఒకరు మెగాస్టార్ ఫ్యామిలీ మరొకరు నందమూరి ఫ్యామిలీ.. ఈ ఫ్యామిలీల నుంచే వచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కు దగ్గరి పోలికలు ఉన్నాయంటే నమ్ముతారా? కానీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయండోయ్ అవేంటో ఇప్పుడు చూసేద్దాం…

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్ షిప్ ను తెరపై కూడా చూపించారు దర్శకధీరుడు రాజమౌళి. ఈయన డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 1300 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది సినిమా. అంతేకాదండోయ్ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది ఈ సినిమా. మరి పోలికలు అనుకున్నాం కదా అవేంటో చూసేద్దాం..

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు వారసత్వం తొనికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ మూడో తరం వారసుడు అయితే.. రామ్ చరణ్ మాత్రం రెండో తరం వారసుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఇద్దరు స్టార్లకు కార్లంటే పిచ్చి. మార్కెట్ లో కొత్త కారు వస్తే కొనగోలు చేయడంలో ఇద్దరు ముందుంటారు. దీనికి బెస్ట్ ఉదాహరణలు కూడా చూసేద్దాం.. అయితే జూ. ఎన్టీఆర్ గత సంవత్సరం లంబోర్ఘిని యూరుస్ గ్రాఫైట్ మోడల్ కారును మన దేశంలో కొనుగతోలు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. మరి దీని ఖరీదు కూడా మామూలుగా లేదండోయ్.. ఏకంగా 3.16 కోట్లు. అంతే కాదు ఎన్టీఆర్ వద్ద మెర్సీడీస్ బెంజ్ జీఎల్ఎస్ 350 డీ, రేంజ్ రోవర్ వోగ్యూ ఎస్ యూవీలు కూడా ఉన్నాయి. ఈ కార్లు మాత్రమే అనుకుంటే పొరపాటు పడినట్లే.. పోర్షే 718 కేమ్యాన్ ను 85.95 లక్షలు పోసి కొన్నాడు ఈ స్టార్ హీరో. ఇన్ని కార్లలో ఎన్టీఆర్ ఎక్కువ యూజ్ చేసే కారు మాత్రం BMW LD. దీని రేట్ ఏకంగా 1.32 కోట్లు. మరో ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే.. ఈకారును డ్రైవర్లు ఉన్నా కానీ వారికి ఇవ్వడట తారక్. స్వయంగా తానే డ్రైవ్ చేస్తారట.

మరి రామ్ చరణ్ కు ఎన్టీఆర్ కు ఈ విషయంలో పోలిక ఏంటి అనుకుంటున్నారా? ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారును ఉపయోగిస్తారు చెర్రీ. కానీ దీన్ని తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చారట. ఇర రామ్ వద్ద మెర్సీడీసె బెంజ్ GLS 350D SUV ఉందట. దీని ధర రూ. 80 లక్షలు. ఎన్టీఆర్ మాదిరి చెర్రీ గ్యారేజ్ లో రూ. 3.34 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్, రూ. 3.5 కోట్ల రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీలు ఉన్నాయి. ఎన్టీఆర్ దగ్గర ఏకంగా రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉందండోయ్.. దీన్ని తారక్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అద్దె ప్రాతిపాదికన పార్క్ చేసి ఉంచుతారట. ఇక రామ్ చరణ్ కు ఏకంగా ట్రూజెట్ పేరిట ఎయిర్ లైన్స్ కంపెనీనే ఉంది.

వాహనాలు అలా ఉంటే బంగ్లాలు కూడా మామూలుగా లేవు ఇద్దరిక.. ఎన్టీఆర్ కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పెద్ద బంగళా ఉంది. ఇటు చిరు, చెర్రీలకు కూడా ఎన్టీఆర్ ఇంటి పక్కనే పెద్ద బంగళాలు ఉన్నాయి. రామ్ చరణ్ హైదరాబాద్ లో ఉంటున్న ఇంటి విలువ ఏకంగా రూ. 30 కోట్లకు పైగానే ఉంటుంది. ఇటు ఎన్టీఆర్ కు హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కోట్లు ఖరీదు చేసే బంగ్లాలు ఉన్నాయట. ఈయన సంపాదించింది కాకుండా వారసత్వంతో వచ్చిన ఆస్తుల విలువ రూ. 450 కోట్లకుపైగానే ఉంటుంది.

రామ్ చరణ్ కు తండ్రితో పాటు భార్య ఉపాసన, సినిమాల ద్వారా వచ్చిన ఆస్తి ఏకంగా రూ. 1350 కోట్లు ఉంటుందని సినిమా ఇండస్ట్రీలో టాక్. ఇక ఎన్టీఆర్ గుంటూరు లోని విజ్జాన్ కాలేజ్ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. రామ్ చరణ్ హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్ లో బీకామ్ చదివారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఇద్దరు కూడా రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలతోనే స్టార్ హీరోలుగా ఎదిగారు. అదే దర్శకుడి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్లుగా మారారు. మరో విషయం ఏంటంటే.. కార్లతో పాటు ఇద్దరికి బైక్స్ అంటే చాలా ఇష్టమట. వాటిని ఇంట్లోనే పెట్టుకున్నారు. అవి కూడా ఖరీదు చేసే బైకులే… ఇక రామ్ చరణ్ వద్ద ఏకంగా ఏడు గుర్రాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకున్నాం కానీ రెమ్యూనరేషన్ అనుకుంటున్నారా? చెర్రీతో పోలిస్తే ఎన్టీఆర్ కు కాస్త ఎక్కువ. కానీ ఇద్దరు బాగానే సంపాదిస్తారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు