Where is Pawan Kalyan? : జనసేన పోటీలో ఉన్నట్లా, లేనట్లా? పవన్ కళ్యాణ్ ఎక్కడ?
తెలంగాణలో పోటీచేయకుంటే బాగుండు కదా పవన్ కళ్యాణ్ అని అందరూ అడుగుతున్నారు. తెలంగాణలో గ్రౌండ్ వర్క్ జరగకుండా ఎక్కువ సీట్లలో పోటీచేయడం పెద్ద మిస్టేక్. క్యాడర్ ను బట్టి పోటీచేయవద్దు.. బలం బట్టి చేయాలి.. పక్కనున్న హైదరాబాద్ లో అయినా పవన్ ప్రచారం చేయాలి కదా.. ఎందుకు తిరగరు.. అన్నది ప్రశ్న.
Where is Pawan Kalyan? : తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8 సీట్లలో పోటీచేస్తోంది. ఖమ్మం జిల్లాలో 4 సీట్లలో, నాగర్ కర్నూల్ తోపాటు, కోదాడ, తాండూర్, కూకట్ పల్లి లలో జనసేన పోటీచేస్తోంది. కూకట్ పల్లి తప్పించి మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం ఎలా జరుగుతోందన్న దానిపై సందేహాలు వెలువడుతున్నాయి. కూకట్ పల్లిలో అభ్యర్థి బీజేపీ నుంచి జనసేనలోకి రావడం.. ఆయనకు సీటు ఇవ్వడం.. డబ్బులున్న వ్యక్తి కావడంతో కొంత ప్రచారం సాగుతోంది. మిగతా నియోజకవర్గాల్లో అస్సలు ప్రచారమే కనిపించడం లేదు.
40 స్థానాల్లో పోటికి దిగి బీజేపీతో పొత్తు పెట్టుకొని చివరి వరకూ పోరాడి 12 సీట్లు అయినా ఇవ్వండని కోరి.. 8 సీట్లకే జనసేననే పరిమితమైంది. ఇంత తక్కువ సీట్లు దక్కించుకున్నా కానీ ప్రచారం మాత్రం కనిపించడం లేదు.
ఏపీలో మూడో ప్రత్యామ్మాయంగా ఎదగాలని చూస్తున్న జనసేన.. తెలంగాణలో పోటీ చూశాక అస్సలు నిరాశ నిసృహలకు గురిచేస్తోంది. పవన్ తెలంగాణలో సీట్లు తీసుకున్నాక ఎందుకు ప్రచారం చేయడం లేదన్నది అంతుచిక్కడం లేదు. పవన్ కనీసం రెండు వారాల్లో విస్తృతంగా పర్యటించి ఉంటే కొంతైనా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రచారం చేయనప్పుడు పవన్ ఎందుకు తెలంగాణలో పోటీచేస్తున్నాడో చెప్పాలి.
తెలంగాణలో పోటీచేయకుంటే బాగుండు కదా పవన్ కళ్యాణ్ అని అందరూ అడుగుతున్నారు. తెలంగాణలో గ్రౌండ్ వర్క్ జరగకుండా ఎక్కువ సీట్లలో పోటీచేయడం పెద్ద మిస్టేక్. క్యాడర్ ను బట్టి పోటీచేయవద్దు.. బలం బట్టి చేయాలి.. పక్కనున్న హైదరాబాద్ లో అయినా పవన్ ప్రచారం చేయాలి కదా.. ఎందుకు తిరగరు.. అన్నది ప్రశ్న.
జనసేన పోటీలో ఉన్నట్లా, లేనట్లా? పవన్ కళ్యాణ్ ఎక్కడ? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.