Ajith Kumar: హీరో అజిత్ అన్ని కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడా?

Ajith Kumar: కమల్ హాసన్, రజనీకాంత్ తరువాత తమిళ ఇండస్ట్రీని ఏలుతున్న హీరోస్ విజయ్, అజిత్. ముఖ్యంగా అజిత్ అంటే తమిళ ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఇక్కడ పవన్ కళ్యాణ్ లాగా అక్కడ అజిత్ కి ఆయన్ని పూజించే భక్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరో గురించి ప్రస్తుతం ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈమధ్య భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అజిత్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతోంది. పేరుకే […]

  • Written By: Neelambaram
  • Published On:
Ajith Kumar: హీరో అజిత్ అన్ని కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడా?

Ajith Kumar: కమల్ హాసన్, రజనీకాంత్ తరువాత తమిళ ఇండస్ట్రీని ఏలుతున్న హీరోస్ విజయ్, అజిత్. ముఖ్యంగా అజిత్ అంటే తమిళ ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఇక్కడ పవన్ కళ్యాణ్ లాగా అక్కడ అజిత్ కి ఆయన్ని పూజించే భక్తులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ హీరో గురించి ప్రస్తుతం ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈమధ్య భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అజిత్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతోంది. పేరుకే అజిత్ తమిళ హీరో. కానీ అతనికి తెలుగులో కూడా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఇక ఎన్నో సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి ఇక్కడ హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

అప్పుడెప్పుడో విడుదలైన వాలి సినిమా దగ్గరనుంచే ఈయనకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ మధ్యలో ఆయన అన్ని సినిమాలు తెలుగులో డబ్ కాకపోయినా ప్రస్తుతం మాత్రం పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఈయన ప్రతి సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్య విడుదలైన ఆయన సినిమాలు కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకున్నాయి.

ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ లో అజిత్ తన తర్వాత మూవీ చేస్తున్నాడు. సాధారణంగా సన్ పిక్చర్స్ నిర్మించే ప్రతి సినిమా కూడా టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ఉంటాయి. దీంతో ఇక అజిత్ నటిస్తున్న సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం అజిత్ తీసుకున్న పారితోషకం కాస్త వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సన్ పిక్చర్స్ అజిత్ కి ఈ సినిమా కోసం 150 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చిందని ఒక టాక్ చక్కర్లు కొడుతుంది.

150 కోట్ల రెమ్యూనరేషన్ అనేది సాధారణమైన విషయం కాదు. అజిత్ కి బాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేదు. అన్ని భాషల్లో మార్కెట్ ఉన్నవారికి 120 నుంచి 150 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడం సహజమే. కానీ కేవలం సౌత్ లో కొన్ని భాషల్లో మాత్రమే క్రేజ్ ఉన్న అజిత్ కి ఇంట పారితోషకం రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు రజిని, కమల్, విజయ్ మాత్రమే ఈ రేంజ్ లో పారితోషకం అందుకున్నారు. ఇక ఇప్పుడు అజిత్ కూడా ఆ లిస్టులో చేరిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరి ఇంతటి రెమ్యునరేషన్ తీసుకుంటున్న అజిత్ తన తదుపరి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తారేమో వేచి చూడాలి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు