NTR Devara Movie: ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రాన్ని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..?

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో , బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు.

  • Written By: Vicky
  • Published On:
NTR Devara Movie: ఎన్టీఆర్  ‘దేవర’ చిత్రాన్ని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..?

NTR Devara Movie: ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ఈసారి కొడితే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం చెదిరిపోవాలి అనే కసితో కొరటాల శివ ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే హైదరాబాద్ లో ప్రారంభమై ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో , బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ లో కనిపించబోతున్నాడు. ఒక పాత్ర పేరు ‘దేవర’ కాగా, మరో పాత్ర పేరు తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రం కొరటాల శివ ముందుగా ఎన్టీఆర్ తో తియ్యాలని అనుకోలేదట. ఈ చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీద్దాం అనుకున్నారట. ‘ఆచార్య’ మూవీ షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనే అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ కి ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసేసాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లి కథ చెప్పగా ఆయనకీ బాగా నచ్చింది.

ఆచార్య సినిమా విడుదలైన వెంటనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా దెబ్బ తినేసరికి ఆయన స్క్రిప్ట్ మీద మరోసారి రీ వర్క్ చేసాడు. రీజినల్ సినిమాగా తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సబ్జెక్టు గా మలిచాడు,మరి ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ ని అలరిస్తుందా లేదా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు