Pawan – Chandrababu : పవన్ శక్తిని చంద్రబాబు లాగేశాడా?
తమ బలం పెరిగిందని చెప్పి.. జనసేన బలాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ బలాన్ని లాగేసి తన బలంలో కలుపుకున్న చంద్రబాబు విషయంలో మున్ముందు జనసేనాని జాగ్రత్తగా ఉండాలని జన సైనికులు కోరుతున్నారు.

Pawan – Chandrababu : పవన్ ను టీడీపీ పక్కన పడేసిందా? ఆయన ద్వారా మైలేజీ పొంది ఇప్పుడు పక్కకు తప్పుకుందా? పార్టీకి ఊపు తెచ్చుకొని జనసేనానిని చంద్రబాబు వదిలేశారా? తనకు అలవాటైన నికర్సయిన రాజకీయాన్ని మరోసారి చాటుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. జవసత్వాలు లేని టీడీపీకి పవన్ ఊపిరిలూదారు. దీంతో పడిలేచిన మాదిరిగా టీడీపీ నిలబడింది. కాస్తా యాక్టివ్ అయ్యింది. అయితే అందుకు కారణమైన పవన్ ను మాత్రం చంద్రబాబు పక్కన పడేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయాల్లో హత్యలుండవంటారు. అన్నీ ఆత్మహత్యలేనని చెబుతారు. ఇప్పుడు పవన్ లో ఉన్నశక్తియుక్తులను చంద్రబాబు చాలా తెలివిగా తనవైపు లాగేసుకున్నారు. తన టీడీపీని పైకిలేపేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ తన శక్తి చాలలేదు. ఇటువంటి సమయంలోనే పవన్ సాయాన్ని అర్ధించారు చంద్రబాబు., అదే పనిగా ప్రయత్నం చేయడంతో పవన్ కూడా మెత్తబడ్డారు. టీడీపీ దారిలోకి వచ్చారు. అచేతనంగా ఉన్న టీడీపీని పొత్తు అనే మందుతో పైకి లేపారు. అయితే గ్రౌండ్ లెవల్ లో జవసత్వాలు ఉన్న టీడీపీకి ఇది కొండంత అండగా పనిచేసింది.
టీడీపీ పండుగ వాతావరణంలో మహానాడు జరుపుకుంది. మిత్రుడు పవన్ తో పొత్తు విషయంలో స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించారు. ఇప్పటికే పలుమార్లు పొత్తు ధర్మం పాటించి పవన్ చాలాసార్లు ముందస్తు అడుగులు వేశారు. కానీ అంతటి పండుగలో కూడా పొత్తు గురించి చంద్రబాబు చిన్న ప్రకటన కూడా చేయలేదు. అయితే అది ముమ్మాటికీ పవన్ ను అవమానించడమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ తన పార్టీ శ్రేణులకు పొత్తుల విషయంలో స్పష్టమైన సంకేతాలు పంపించారు. వారికి పొత్తుల దిశగా మానసికంగా సిద్ధం చేశారు. చంద్రబాబు మాత్రం ఆ పనిచేయలేదు. మహానాడు ద్వారా మంచి అవకాశమొచ్చినా.. ఆయన పాత రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చారు.
స్ట్రయిట్ ఫార్వర్డ్ రాజకీయాలనే పవన్ అలవాటు చేసుకున్నారు. కానీ అవి కాలం చెల్లినవని ఆయనకు అర్ధం కావడం లేదు. అక్కడే అధినేత తీరుపై జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదుటి వారి మనస్తత్వాలను ఎరిగి రాజకీయం చేయాలంటున్నారు. పవన్ బలాన్ని వాడుకొని టీడీపీకి జవసత్వాలు నింపారు చంద్రబాబు. ఇప్పుడు అది తన బలమేనని చెబుతున్నారు. పవన్ విషయంలో వెనక్కి తగ్గినట్టు సంకేతాలు ఇస్తున్నారు. తమ బలం పెరిగిందని చెప్పి.. జనసేన బలాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ బలాన్ని లాగేసి తన బలంలో కలుపుకున్న చంద్రబాబు విషయంలో మున్ముందు జనసేనాని జాగ్రత్తగా ఉండాలని జన సైనికులు కోరుతున్నారు.
