IPL 2023: అందమైన యాంకర్లతో ఆటకు మరింత గ్లామర్: ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్
IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభ మ్యాచ్లో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తమన్నా, రష్మిక తో ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. అయితే ఐపీఎల్ లో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లకు వీరాభిమానులు ఉన్నట్టే.. మైదానంలో యాంకరింగ్ చేసే వారికి కూడా డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా లేడీ యాంకర్లకు […]


IPL 2023
IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభ మ్యాచ్లో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తమన్నా, రష్మిక తో ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. అయితే ఐపీఎల్ లో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లకు వీరాభిమానులు ఉన్నట్టే.. మైదానంలో యాంకరింగ్ చేసే వారికి కూడా డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా లేడీ యాంకర్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.

IPL 2023
తమ అందంతో పాటు మాటతీరుతో క్రికెట్ అభిమానులను, నెటిజన్ల ను యాంకర్లు ఆకట్టుకుంటారు. ఐపీఎల్ నిర్వాహకులు ప్రతి సీజన్లోనూ కొత్త కొత్త యాంకర్లను తీసుకొస్తుంటారు.. మందిరా బేడి, శోనాలినాగరాణి, లేఖా వాషింగ్టన్, కరిష్మా కోటక్, ఇసా గుహ, పల్లవి శారద, అర్చన విజయ, మయాంతి లాంగర్, రోచెల్లె మరియా రావ్, ఆ కోవకు చెందినవారే. వీరంతా ఆటకు తమ అందాన్ని జోడించి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చారు.

IPL 2023
ఐపీఎల్ ప్రారంభ సీజన్లో మందిర బేడీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చారు. అప్పట్లో మందిరా బేడి నిర్వహించిన ఎక్స్ ట్రా ఇన్నింగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేది. తన మాటతీరుతో ఆటగాళ్ళను నవ్వించేది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత కూడా రేటింగ్స్ భారీగా పెరిగేవి.. మందిర బేడీ ఎక్స్ట్రా ఇన్నింగ్స్ పేరుతో నిర్వహించే షో ను చాలామంది ఎగబడి చూసేవారు.

IPL 2023
మందిరా బేడీ తర్వాత శోనాలి నాగరాణి ఐపీఎల్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. స్వతహాగా మంచి యాంకర్ అయిన నాగరాణి తన మాట పేరుతో ఆటగాళ్ళను ఆకట్టుకునేది. సీనియర్ ప్లేయర్లతో చర్చా వేదిక నిర్వహించేది. లేఖా వాషింగ్టన్, కరిష్మా కోటక్, ఇసా గుహ, పల్లవి శారద కూడా ఐపీఎల్ కు సరికొత్త ఆకర్షణ తీసుకొచ్చారు.

IPL 2023
ఇక మయాంతి లాంగర్, రోచెల్లే మరియా రావ్ అయితే ఐపీఎల్ గత ఏడాది సీజన్ ను ఒక ఊపు ఊపారు.. చూపు తిప్పుకొనివని తమ అందంతో ఐపీఎల్ కు కొత్త ఆకర్షణ తీసుకొచ్చారు..వాక్ చాతుర్యంతో అభిమానులను అలరించారు..ఈ ఏడాది కూడా ఐపీఎల్ నిర్వాహకులు సరికొత్త గ్లామర్ జోడించేందుకు సిద్ధమవుతున్నారు.

IPL 2023

IPL 2023

IPL 2023