Gujarat Vs Chennai: IPL2023: గుజరాత్ వర్సెస్ చెన్నై: ధోని పై రెండు సార్లూ పాండ్యా దే పై చేయి.. ఈసారి ఏమవుతుందో?

Gujarat Vs Chennai: ఐపీఎల్ 16వ సీజన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం తొలి మ్యాచ్ చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరగనుంది. ఈ క్రమంలో రెండు జట్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి. ఇక్కడి నరేంద్ర మోడీ మైదానంలో తొలి మ్యాచ్ లో ఈ రెండు జట్లు తల పడనున్నాయి. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడింది ఒక మ్యాచ్చే. గత ఏడాది గుజరాత్ ఐపీఎల్ లోకి అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ […]

Gujarat Vs Chennai: IPL2023: గుజరాత్ వర్సెస్ చెన్నై: ధోని పై రెండు సార్లూ పాండ్యా దే పై చేయి.. ఈసారి ఏమవుతుందో?

Gujarat Vs Chennai: ఐపీఎల్ 16వ సీజన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం తొలి మ్యాచ్ చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరగనుంది. ఈ క్రమంలో రెండు జట్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి. ఇక్కడి నరేంద్ర మోడీ మైదానంలో తొలి మ్యాచ్ లో ఈ రెండు జట్లు తల పడనున్నాయి. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడింది ఒక మ్యాచ్చే. గత ఏడాది గుజరాత్ ఐపీఎల్ లోకి అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరిగాయి. ఈ రెండూ మ్యాచ్ ల్లోనూ గుజరాత్ జట్టు విజయం సాధించింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం గుజరాత్ జట్టుదే మరోసారి పై చెయ్యి లాగా కనిపిస్తోంది. ఇక్కడ ధోని సారథ్యంలో చెన్నై జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు.

గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్.. ఈసారి కూడా టైటిల్ నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించింది.. అయితే నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గత సీజన్లో ఈ వేదిక హోమ్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య బ్లాక్ బస్టర్ ఫైనల్ తో సహా రెండు ఐపిఎల్ మ్యాచ్లకు ఆతిధ్యం ఇచ్చింది.. ఈ వేదికపై గతంలో జరిగిన టి20 మ్యాచ్ లను పరిశీలిస్తే.. చేజింగ్ జట్టు పై చేయి సాధించింది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మేటి బ్యాటర్లు ఉన్నారు. ఎంఎస్ ధోని, కాన్వే, రుతు రాజ్ గైక్వాడ్, సేనాపతి, రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే లాంటి వారు ఉన్నారు.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీరు బ్యాట్ తో చెలరేగ గలరు. బెన్ స్టోక్స్ ఉండటం కూడా చెన్నై జట్టుకు మరింత లాభం చేకూర్చే విషయం. బౌలింగ్ విషయంలోనూ బలంగా కనిపిస్తోంది. షేక్ రషీద్, నిశాంత్ సింధు, సాంట్నర్ వంటి వారు బంతులతో మాయ చేయగలరు.

Gujarat Vs Chennai

Gujarat Vs Chennai

ఈ గణాంకాల ప్రకారం టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్లో వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. 20 ఓవర్ల మ్యాచ్ సమయంలో గాలి వేగం గంటకు 13 నుంచి 18 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 22 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది. అయితే తేమ 57% గా ఉంటుందని భావిస్తోంది.. ఇక గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రసారం కానుంది. మొబైల్లో చూడాలి అనుకునేవారు జియో సినిమా యాప్, వెబ్ సైట్ లో చూడవచ్చు.

జట్ల అంచనా ఇలా

గుజరాత్ టైటాన్స్

హార్దిక్ పాండ్యా ( కెప్టెన్), గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహ, వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారి జోసెఫ్, యష్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, సాయి కిషోర్, అహ్మద్, కెన్ విలియంసన్, ఓడియన్ స్మిత్, కేఎస్ భరత్, శివం మావి, ఉరువిల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.

చెన్నై సూపర్ కింగ్స్

ఎంఎస్ ధోని (కెప్టెన్), డేవిడ్ కాన్వే, రుతు రాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సేనాపతి, మొయిన్ అలీ, శివం దుబే, రాజ వర్ధన్ హంగర్కర్, ప్రిటోరియస్, సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే, మటీ సింగజేత్, ముఖేష్ చౌదరి సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేష్ తీక్షణ, అజింక్య రహనే, బెన్ స్టోక్స్, షేక్ రశీద్, నిశాంత్ సింధు, సిసంద మగల, అజయ్ మండల్, భగత్ వర్మ.

సంబంధిత వార్తలు