IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ లో తమన్నా అదిరిపోయే పెర్ఫార్మన్స్… స్టేడియం దద్దరిల్లింది!

IPL 2023 Opening Ceremony: టాటా ఐపీఎల్ నేడు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రారంభ కార్యక్రమంలో తారలు సందడి చేశారు. రష్మిక మందాన, తమన్నాతో పాటు పలువురు ఆర్టిస్ట్స్ తమ టాలెంట్స్ తో అలరించారు. తమన్నా పెర్ఫార్మన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె టైట్ ఫిట్ ధరించి శరీర వంపులు ప్రదర్శించింది. విశాల్ హీరోగా నటించిన ఎనిమీ చిత్రంలోని ‘టమ్ టమ్’ సాంగ్ కి డాన్స్ చేశారు. ఐపీఎల్ వేడుకలో తమన్నా పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది. ఆమె […]

  • Written By: SRK
  • Published On:
IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ లో తమన్నా అదిరిపోయే పెర్ఫార్మన్స్… స్టేడియం దద్దరిల్లింది!

IPL 2023 Opening Ceremony: టాటా ఐపీఎల్ నేడు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రారంభ కార్యక్రమంలో తారలు సందడి చేశారు. రష్మిక మందాన, తమన్నాతో పాటు పలువురు ఆర్టిస్ట్స్ తమ టాలెంట్స్ తో అలరించారు. తమన్నా పెర్ఫార్మన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె టైట్ ఫిట్ ధరించి శరీర వంపులు ప్రదర్శించింది. విశాల్ హీరోగా నటించిన ఎనిమీ చిత్రంలోని ‘టమ్ టమ్’ సాంగ్ కి డాన్స్ చేశారు. ఐపీఎల్ వేడుకలో తమన్నా పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది. ఆమె డ్రెస్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

తమన్నా ప్రదర్శనకు సంబంధించిన వీడియో ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న తమన్నా… ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్ లో పెరఫామెన్స్ ఇస్తూ ఆకర్షిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రజినీకాంత్ కి జంటగా జైలర్ మూవీ చేస్తున్నారు. కెరీర్లో మొదటిసారి తమన్నా రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.

తమన్నా ఖాతాలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ భోళా శంకర్. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. గతంలో తమన్నా సైరా మూవీలో చిరంజీవికి జంటగా నటించారు. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించడం జరిగింది. భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేస్తున్నారు.

IPL 2023 Opening Ceremony

IPL 2023 Opening Ceremony

టాలీవుడ్ లో తమన్నా లాంగ్ కెరీర్ అనుభవించారు. ఆమె పరిశ్రమకు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. ఇన్నేళ్లు ఫేడ్ అవుట్ కాకుండా పరిశ్రమలో ఉండటం నిజంగా గొప్ప విషయం. ఇటీవల తమన్నా మీద ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. పలు సందర్భాల్లో ఈ జంట కలిసి కనిపించారు. దీంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే తమన్నా ఈ వార్తలను ఖండించారు.