IPL 2023: ఐపీఎల్ మ్యాచ్ మైదానంలో షాకింగ్ : ఇంత కరువులో ఉన్నావేంట్రా బాబు..!
స్టేడియంలో ఓ వ్యక్తి విదేశీ యువతలు(చీర్ లీడర్ల) గురించి సెక్సిజం, స్త్రేద్వేషం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను గౌరవించే భారత దేశంలో ఇలాంటి ప్లకార్డు ప్రదర్శనను ఎంకరేజ్ చేయొద్దని కామెంట్ చేస్తున్నాడు.

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఉత్కంఠ రేపే మ్యాచ్‌లతోపాటు ఇటీవల ఒకటి రెండు వివాదాలు కూడా జరిగాయి. కొన్ని ఆసక్తికర సంఘనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీల ఓ బుడ్డోడు.. విరాట్ కోహ్లీ కూతురును డేటింగ్‌కు తీసుకెళ్తా అంటూ ప్లకార్డు ప్రదర్శించాడు. ఆసక్తిగా ఉన్నా.. అంత చిన్న బుడ్డోడికి ఎవరో రాసి ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. తాజాగా ఇలాంటిదే మరో వివాదాస్పద ప్లకార్డు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించింది. సెక్సిస్ట్ సందేశంలో కూడిన ప్లకార్డు పట్టుకుని కినిపించాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
గుజరాత్, లక్నో మ్యాచ్‌లో..
ఇటీవల 2023లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్ట మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఓ వ్యక్తి సెక్సిస్ట్ సందేశంతో కూడిన ప్లకార్డ్ పట్టుకుని స్టేడియంలో కనిపించాడు. ప్లకార్డుపై ‘మ్యాచ్ నహీ రష్యన్ దేఖ్నే ఆయా హు’(నేను మ్యాచ్ చూడటానికి ఇక్కడకు రాలేదు కానీ రష్యన్లు) అని స్త్రీ ద్వేషపూరిత ప్లకార్డ్ రాసి ఉంది. చీర్ లీడర్లను చూడడానికి వచ్చాను అని ఆ సందేశం అర్థం. విదేశీ చీర్ లీడర్లపై ఈ వ్యాఖ్య స్టాండ్ అప్ కమెడియన్ హర్ష్ గుజ్రాల్ చేసిన వివాదాస్పద జోక్ నుంచి వచ్చినట్లుగా ఉంది. ఇందులో అతను ‘6000 మై రష్యన్ అజాతీ హై‘ అని చెప్పాడు. అయితే దీనిని ఒక వర్గం కేవలం జోక్ మాత్రమే అని చెప్పడంతో నెటిజన్లు రెండుగా విడిపోయారు.
స్త్రీ ద్వేషంపై ఆందోళన..
స్టేడియంలో ఓ వ్యక్తి విదేశీ యువతలు(చీర్ లీడర్ల) గురించి సెక్సిజం, స్త్రేద్వేషం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను గౌరవించే భారత దేశంలో ఇలాంటి ప్లకార్డు ప్రదర్శనను ఎకరేజ్ చేయొద్దని కామెంట్ చేస్తున్నాడు. ఇది మన దేశ గౌరవానికి, సమానత్వానికి భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నెటిజన్లు ఫొటోలు, వీడియోలను ట్రోల్ చేస్తున్నారు.
ఇంత కరువేంట్రా..
మ్యాచ్ చూడడాకి వచ్చి ఇలా సెక్సిజం ప్లకార్డ్ ఏంట్రా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కరువులో ఉన్నాడా వీడు అని మండిపడుతున్నారు. ఆటను ఆస్వాదించాల్సిన చోట.. ఇలాంటివి ఇబ్బంది కరంగా ఉంటాయని, విదేశీ యువతులను కామెంట్ చేయడం ద్వారా దేశానికి మచ్చ తెస్తుందని పేర్కొంటున్నారు. కరువులో ఉంటే ఇక్కడకు రావడం ఎందుకురా.. ఎర్రినా పుష్పం అని విమర్శిస్తున్నారు .
