IPL 2023: ఐపీఎల్ 2023 : ముగింపు వేళ అత్యధికంగా కొట్టింది.. వికెట్లు తీసింది ఎవరో తెలుసా?

ఐపీఎల్ దశ ముగిసే నాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాపు డు ప్లేసిస్ 153.68 స్ట్రైక్ రేట్ తో 730 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.

IPL 2023: ఐపీఎల్ 2023 : ముగింపు వేళ అత్యధికంగా కొట్టింది.. వికెట్లు తీసింది ఎవరో తెలుసా?

IPL 2023: ఐపీఎల్ 17వ సీజన్ తుది అని అంచెకు చేరింది. ప్లే ఆఫ్ కు సంబంధించి జరిగిన పోరులో బెంగళూరు మీద గుజరాత్ జట్టు గెలిచింది. మరోవైపు హైదరాబాద్ మీద ముంబై గెలిచి తన ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఐపీఎల్ లో జట్ల ప్రదర్శన తర్వాత అందరూ ప్రముఖంగా చూసేది ఆటగాళ్ల ఆట తీరును.. ఇందుకుగాను ఐపీఎల్ లో ఉత్తమ బ్యాట్స్మెన్ కు ఆరెంజ్ క్యాప్, బౌలర్ కు పర్పుల్ క్యాప్ ప్రధానం చేస్తారు.. అయితే ఈసారి జట్లు మొత్తం హోరాహోరీగా పోరాడటం, ఆటగాళ్లు కూడా తమ శక్తికి మించి ప్రదర్శన చేయడంతో రికార్డు స్థాయిలో గణాంకాలు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు సెంచరీలు మోతక్కి పోయాయి. 5 వికెట్ల హాల్స్ కూడా నమోదయ్యాయి.

ఇప్పటికైతే వీరే..

ఐపీఎల్ దశ ముగిసే నాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాపు డు ప్లేసిస్ 153.68 స్ట్రైక్ రేట్ తో 730 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గిల్ 680 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే గుజరాత్ జట్టు బెంగళూరును ఓడించి ప్లే ఆఫ్ కు చేరడంతో గిల్ మరిన్ని పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ ను ఒడిసిపట్టే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక లీగ్ చివరి దశలో గిల్ 54 బంతుల్లో 104 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇక ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.. 140 స్ట్రైక్ రేటుతో 638 పరుగులు చేశాడు. బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో విరాట్ పరుగులు చేసే అవకాశం లేదు. అయితే అతడు ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన మూడవ బ్యాటర్ గా నిలవడం ఖాయం. ఈ సీజన్ లో గిల్, విరాట్ చెరి రెండు సెంచరీలు సాధించడం విశేషం. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు ఆల్రౌండర్ గ్రీన్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో ఆరు సెంచరీలు నమోదు కాగా.. ఇందులో రాజస్థాన్ జట్టుకు చెందిన యశస్వి జైపాల్ 124 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి సూర్య కుమార్ యాదవ్ 103 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టుకు చెందిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ 103, హైదరాబాద్ నుంచి హ్యారీ బ్రూక్ 100 క్లాసెన్ 104, కోల్ కతా నుంచి వెంకటేష్ అయ్యర్ 104 పరుగులు సాధించారు.

వీరూ తక్కువేం కాదు..

ఇక ఈ సీజన్ ప్రారంభంలో రాజస్థాన్ ఆటగాడు జైపాల్ వేగవంతంగా 50 పరుగులు చేశాడు. 163.31 స్ట్రైక్ రేట్ తో 625 పరుగులు చేసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ కాన్వే 585 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో జట్లు కూడా ప్లే ఆఫ్ రేసులో ఉండడంతో బ్యాటర్లు మరిన్ని పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇక వీరే కాకుండా మరో ముగ్గురు బ్యాటర్లు 500 పైగా పరుగులు చేశారు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 516, ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ 511, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 504 పరుగులు చేశారు.. ఈ సీజన్లో కనీసం 150 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ స్ట్రైక్ రేట్ 185.14 ఉండటం విశేషం. ఇక శనివారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టుకు చెందిన రింకూ సింగ్ 67 పరుగులు చేశాడు. మొత్తానికి ఈ టోర్నీలో అతడు 474 పరుగులు చేసి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాడు. క్లాసేన్ 448 పరుగులు సాధించాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో డూప్లెసిస్ 8 అర్ధ సెంచరీలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ, కాన్వే తలా ఆరు, జైస్వాల్,గ్లెన్ మాక్స్ వెల్ కూడా ఐదు అర్థ సెంచరీలు సాధించారు.

పర్పుల్ క్యాప్ విభాగంలో..

టైటాన్స్ బౌలర్ మహమ్మద్ షమీ 7.7 ఎకనామితో 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్ కూడా 24 వికెట్లు సాధించి షమీ సరసన నిలిచాడు. ఇతడి ఎకానమీ రేటు 7.82 ఉండటం విశేషం. మూడో స్థానంలో రాయల్స్ జట్టు లెగ్ స్పిన్నర్ యజువెంద్ర చాహల్ కొనసాగుతున్నాడు.. ఈ సీజన్లో అతడు 21 వికెట్లు తీశాడు. ముంబై జట్టుకు చెందిన పీయూష్ చావ్లా 7.81 సగటుతో 20 వికెట్లు సాధించి నాలుగువ స్థానంలో ఉన్నాడు. కోల్ కతా జట్టుకు చెందిన వరుణ్ చక్రవర్తి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన దేశ్ పాండే 20 వికెట్లు సాధించి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు. మహమ్మద్ సిరాజ్ 7.5 ఎకానమీతో 19 వికెట్లు తీశాడు.. టైటాన్స్ జట్టు మూడో బౌలర్ మోహిత్ శర్మ, పంజాబ్ జట్టుకు చెందిన అర్ష్ దీప్ సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన రవీంద్ర జడేజా ఈ సీజన్లో 17 వికెట్లు పడగొట్టారు.

సంబంధిత వార్తలు