IPL 2022: Sunrisers Hyderabad: ఐపీఎల్ లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి ప్లే ఆఫ్ అవకాశాలు దోబూచులాడుతున్నాయి. ఒకటి అనుకుంటే మరోటి జరుగుతోంది. దీంతో జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ప్లే ఆఫ్ ముంగిట జయాపజయాలు అన్ని జట్లను ఆందోళనలో పడేస్తున్నాయి. సీజన్ లో పడుతూ లేస్తూ పంజాబ్ కింగ్స్ మరో పరాజయాన్ని చవి చూసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్ చేతిలో దారుణంగా ఓటమి పాలైంది. ఆర్సీబీపై 209 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం గమనార్హం.

Sunrisers Hyderabad
ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా ప్లే ఆప్స్ కు వెళ్లడం తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించడంతో సమీకరణలు మారిపోవడం తెలిసిందే. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానంలో ఉన్నా ఈ గెలుపుతో నాలుగో స్థానంలో నిలవడం నిలవడంతో మిగతా జట్లకు వణుకు పుడుతోంది. కీలకంగా మారిన మ్యాచుల్లో నెగ్గుతూ ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లు సాధించి ప్లే ఆప్ ఆశలు సజీవం చేసుకుంది.
Also Read: Koratala Siva-NTR: ఎన్టీఆర్ తో రిస్క్ చెయ్యడానికి భయపడుతున్న కొరటాల శివ
ఢిల్లీ క్యాపిటల్స్ చివరి మ్యాచ్ మంబై ఇండియన్స్ తో శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ ఆటలో ఢిల్లీ గెలిస్తే కచ్చితంగా ప్లే ఆప్ కు వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. నాలుగు జట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే వీటికి ఇబ్బందులు రావొచ్చు. ఒకవేళ ఓడితే మాత్రం నాలుగు జట్లలో నూతన ఆశలు చిగురించడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో నాలుగు జట్ల భవితవ్యం ముడిపడి ఉంది. హైదరాబాద్ ఖాతాలో పది పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఇవాళ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈరెండింట్లో గెలిచినా దానికిదక్కేది 14 పాయింట్లే. 12 పాయింట్తో ఉన్న కోల్ కత చివరిలీగ్ మ్యాచ్ లో లక్నోతో పోరాడనుంది. ఇందులో కేకేఆర్ గెలిచినా 14పాయింట్లవద్దే ఆగిపోవడం గమనార్హం.

Sunrisers Hyderabad
ఇప్పుడు 14 పాయింట్తతో ఉన్న రాయల్ చాలెంజర్స్ చివరిలీగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. ఇందులో విజయం సాధిస్తే 16 పాయింట్లు దక్కడం ఖాయమే. ముంబై ఇండియన్స్ ను ఓడించిన ఢిల్లీ క్యాపిటత్స్ తో సమానం అవుతుంది. ఎలా చూసినా రన్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.
ఎలా చూసినా హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆశలు గల్లంతయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ కనుక విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ చివరి లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ ను ఢీకొనాల్సి ఉంటుంది. ఇందులో పంజాబ్ ఓడితే అంతే. గెలిస్తే ఢిల్లీ నెట్ రన్ రేట్ చూసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్ ఖాతాలో 12 పాయింట్లు ఉండటంతో సన్ రైజర్స్ గెలిస్తే 14 పాయింట్లు మాత్రం రావడంతో ప్లే ఆఫ్ ఆశలకు తావు లేదని తెలుస్తోంది.
Also Read:Trivikram-Mahesh Babu Movie: మహేష్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్ పై ఫాన్స్ కి అదిరిపోయ్యే న్యూస్