Junior NTR: చంద్రబాబు పోటు.. తాత గుర్తులు.. జూ.ఎన్టీఆర్ కు వెనుక గొయ్యి.. ముందు నుయ్యి
కొద్దిరోజులుగా చంద్రబాబు కుటుంబంతో జూనియర్ కు గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యక్రమాల్లో తారక్ అస్సలు కనిపించడం లేదు. లోకేష్ కోసమే తారక్ ను చంద్రబాబు పక్కనపెట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే ఇవేవీ పట్టించుకొని జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంపైనే ఫోకస్ పెంచారు. ప్యాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

Junior NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను గ్రాండ్ జరపాలని ప్లాన్ చేశారు. ఇటు ఏపీ, అటు తెలంగాణలతో సైతం నిర్వహించాలని ఉత్సవ కమిటీ డిసైడ్ అయ్యింది. ఏపీకి సంబంధించి విజయవాడలో వేడుకలు పూర్తయ్యాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటు నందమూరి కుటుంబసభ్యులు మెరిశారు. కానీ యువ కథా నాయకులు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల జాడలేదు. వారికి ఇన్విటేషన్ ఇచ్చారా? లేదా? అన్నది తెలియడం లేదు. కానీ జూనియర్ కనిపించకపోవడంతో పెద్ద దుమారమే రేగింది. ఆయన అభిమానులు హర్టయ్యారు. టీడీపీలోని నందమూరి ఫాలోవర్స్ బాధపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ నెల 20న జరగనున్న వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ టీడీ జనార్ధన్, ఎన్టీఆర్ చిన్న కుమారుడు రామక్రిష్ణ స్వయం వెళ్లి తారక్ కు ఇన్విటేషన్ పంపించారు.
అయితే ఒక్క జూనియర్ కే కాదు నందమూరి కుటుంబసభ్యులందరికీ ఆహ్వానాలు పంపించారు. అందరూ కార్యక్రమానికి హాజరుకానున్నారు. జూనియర్ కు ఆహ్వానం అందడంతో అటు ఫ్యాన్స్, టీడీపీలో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. నందమూరి కుటుంబంలో విభేదాలు లేవని చెప్పడానికి ఒక వేదిక దొరికిందని సంబరపడ్డారు. గ్రూప్ ఫొటోతో అదిరిపోతుందని..ప్రత్యర్థులకు దీటైన సమాధానమిచ్చినట్టవుతుందని భావించారు. కానీ ఇలా అభిమానులు ఆనందిస్తున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ నీళ్లు చల్లారు. ఆయన హాజరుకావడం అనుమానమే అన్న వార్త చక్కెర్లు కొడుతోంది.
గత కొద్దిరోజులుగా చంద్రబాబు కుటుంబంతో జూనియర్ కు గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యక్రమాల్లో తారక్ అస్సలు కనిపించడం లేదు. లోకేష్ కోసమే తారక్ ను చంద్రబాబు పక్కనపెట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే ఇవేవీ పట్టించుకొని జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంపైనే ఫోకస్ పెంచారు. ప్యాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మరికొన్నాళ్లు సినిమా రంగంలోనే ఉండాలని భావిస్తున్నారు. అందుకే రాజకీయ వేదికలు కానీ.. రాజకీయ వ్యాఖ్యలు కానీ చేయడం లేదు. ఎక్కడా ఆ ముద్ర పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇప్పుడు తాత ఎన్టీఆర్ వందేళ్ల పండుగకి ప్రత్యేక ఆహ్వానం అందింది. కుటుంబసభ్యులంతా ఒకచోటకు చేరే అరుదైన అవకాశం వచ్చింది. చంద్రబాబుతో వేదిక పంచుకోవాల్సి వచ్చింది. అయితే దీనికి జూనియర్ గైర్హాజరయ్యే చాన్సే ఎక్కువ అని ప్రచారం జరుగుతోంది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఏటా క్లోజ్ ఫ్యామిలీస్ తో విదేశాల్లో గడపడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా మాల్దీవులు వెళ్లేందుకు జూనియర్ ఎన్టీఆర్ నెలల ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు తాత శతజయంతి వేడుకలకు ఆహ్వానం అందడంతో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.
ఒకవేళ గైర్హాజరైతే ఉద్దేశపూర్వకంగా రాలేదని విమర్శలు చుట్టుముడతాయి. అదే హాజరైతే ఒక్క శతజయంతి వేడుకలతో ఆగదు. మహానాడు కార్యక్రమానికి సైతం ఆహ్వానిస్తారు. అటు తరువాత రాజకీయ ప్రసంగాలు, వచ్చే ఎన్నికల్లో ప్రచారం ఇలా అన్నింటిపై పుకార్లు, షికార్లు చేస్తాయి. అది తన సినీ కెరీర్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అందుకే ఫ్యామిలీతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఖమ్మంలో ఈ నెల 28న ఎన్టీఆర్ భారీ విగ్రహావిష్కరణకు సైతం ప్రత్యేక ఆహ్వానం అందింది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానించారు. అప్పటికే మాల్దీవుల పర్యటన ముగించుకొని తారక్ హైదరాబాద్ చేరుకుంటారు. ఆ కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యే చాన్స్ ఉంది. అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కు దూరంగా ఉండి.. ఖమ్మం కార్యక్రమానికి హాజరైనా సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే తారక్ ఆచీతూచీ నిర్ణయాలు తీసుకునే చాన్సే ఎక్కువుగా కనిపిస్తోంది.
