CM KCR- Gurukul Schools: తెలంగాణలో విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే నైపుణ్యాల అభివృద్ధికి దోహదం చేసే విధంగా తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి గాను సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీటిలో ఇంటర్మీయట్ విద్య కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నారు.

CM KCR
గురుకుల పాఠశాలల్లో సాంకేతికకు కూడా పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ చేసే ఉద్దేశంతో స్టడీ సర్కిళ్లుగా మార్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో గురుకులాల్లో విద్యార్థుల్లో శిక్షణ ఇప్పించే కేంద్రాలుగా రూపుదిద్దుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దీంతో గురుకులాల్లో వైమానిక దళం, బ్యాంకింగ్, ఇతర రంగాల్లో శిక్షణ ఇప్పించి వారు ఉద్యోగాల్లో స్థిరపడేందుకు పరోక్షంగా దోహదం చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Chor Baazar 12 Days Collections: ‘చోర్ బజార్’ 12 డేస్ కలెక్షన్స్.. నష్టాల పుట్ట ఇది
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో 132 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పించి వారిని ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాల్సిన అవసరం అధికారులపై ఉంది. ఈ క్రమంలో విద్యార్థులకు చదువుతోపాటు కోచింగ్ సైతం ఇప్పించి వారిలో మానసిక స్థైర్యం నింపి వారిని ఉద్యోగాల వేటకు సంసిద్ధులను చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో చదువు పూర్తయ్యే నాటికి వారు ఏదో ఒక ఉద్యోగం సంపాదించి కన్నవారికి భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలుస్తోంది.

CM KCR
విద్యార్థుల ఉత్సాహాన్ని బట్టి వారికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాల కోసం వారిని తయారు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీంతో విద్యార్థులు గురుకులాల్లో చదివితే అన్ని రకాల ప్రయోజనాలు దక్కే అవకాశం ఏర్పడింది. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునే వారికి వారి శ్రద్ధను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల భవితవ్యం మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉపాధి రంగంలో స్థిరపడి పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉంటారని ఆలోచించడం మంచిదే.
Also Read:Samantha: సీక్రెట్స్ : రూ.500 కోసం ఆ పని చేసిన సమంత.. ఇప్పుడు కోట్లు..