Interim Orders Of Supreme Court On Amaravati : అమరావతిపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎవరికీ వారు తమకు అనుకూలంగా ఈ తీర్పును అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వింటే వీరు మూడు రాజధానులు కోరుకుంటున్నారా? అన్న డౌట్ కూడా రాకమానదు.
హైకోర్టు అమరావతిలోనే ఉంచాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం మార్చడానికి లేదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతానికి ఏది రాజధాని అంటే ‘అమరావతి’ అని ఏపీ ప్రభుత్వం వాదించింది. మరి ఎందుకీ గొడవ అంటే.. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థకు అధికారం ఉందా? లేదా? అన్న దానిపైనే ఇప్పుడు ఈ వివాదం నడుస్తోంది. మూడు నెలల్లోనే అభివృద్ధి చేయాలన్న అధికారం కోర్టుకు లేదు.
ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలను జగన్ సుప్రీంకోర్టుకు ఎక్కి తేల్చుకోవడానికి వెళ్లాడు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం అన్యాయం అయిపోయారు. ఈ ప్రశ్నకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రైతులకు ఆదాయం ఉందా? అని అడిగారు.
అమరావతిపై సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వం వాదనలు వింటే ఏమనిపిస్తోంది? ఎలా వాదించిందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.