Chiranjeevi Bhola Shankar: ‘భాష’ రేంజ్ ఫ్లాష్ బ్యాక్ తో ‘భోళా శంకర్’..మెహర్ రమేష్ కూడా మామూలోడు కాదుగా!
మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు.ఇది ఇలా ఉండగా ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ మొదటి నుండి తీవ్రమైన నిరాశలోనే ఉన్నారు, ఎందుకంటే ఈమధ్య కాలం లో రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి.

Chiranjeevi Bhola Shankar: ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి టాలీవుడ్ ఆల్ టైం టాప్ 3 నాన్ రాజమౌళి సినిమాలలో ఒకటిగా నిల్చింది.అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న చిత్రం ‘భోళా శంకర్’.ఇది తమిళం లో అజిత్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదలమ్’ కి రీమేక్ గా తెరకెక్కింది.
మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు.ఇది ఇలా ఉండగా ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ మొదటి నుండి తీవ్రమైన నిరాశలోనే ఉన్నారు, ఎందుకంటే ఈమధ్య కాలం లో రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి.పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి,ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు ఆడవు అని, అందుకు ఉదాహరణ మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ చిత్రమే అని చెప్తున్నారు.
కానీ ‘భోళా శంకర్’ సినిమా మాత్రం ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఉంటూనే, వేరే లెవెల్ ఎలివేషన్ సీన్స్ ని రాసుకున్నాడట డైరెక్టర్ మెహర్ రమేష్. కేవలం ఒరిజినల్ వెర్షన్ థీమ్ ని తీసుకొని, స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తాన్ని మార్చేశారని, ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుందని, కానీ సెకండ్ హాఫ్ లో బాష రేంజ్ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ఇక ఈ చిత్రం తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది.అన్న చెల్లెళ్ళ మధ్య సెంటిమెంటల్ సన్నివేశాలు మంచి రక్తి కట్టించే రేంజ్ లో వచ్చాయట.రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ షూటింగ్ లొకేషన్ లో మెగాస్టార్ ఫోటోలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.ఇదంతా చూస్తూ ఉంటే మెగాస్టార్ కెరీర్ లో మరో వంద కోట్ల రూపాయిల షేర్ సినిమా రాబోతుందని అర్థం అయిపోతుంది.
