Sidharth Luthra: చంద్రబాబుకు బెయిల్ వేళ.. ఆయన లాయర్ సిద్ధార్థ లూథ్ర ఆసక్తికర ట్విట్
చంద్రబాబు కేసు విషయంలో పిటిషన్లు, విచారణలు, వాయిదాలతో అయోమయం నెలకొంది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏకకాలంలో విచారణలు కొనసాగాయి. అయితే ఎక్కడ చంద్రబాబుకు ఊరట దక్కలేదు.

Sidharth Luthra: చంద్రబాబు కేసుతో చాలామంది సెలబ్రిటీలు గా మారారు. ముఖ్యంగా న్యాయవాదులు మరింత సుపరిచితమయ్యారు. ఏసీబీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సిద్ధార్థ లూధ్ర పేర్లు బలంగా వినిపించాయి. సెప్టెంబర్ 9న అర్ధరాత్రి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు మార్గం గుండా విజయవాడ తీసుకొచ్చారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లూధ్ర ను ప్రత్యేకంగా రప్పించారు. సిఐడి తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అప్పటినుంచి ఈ ఇద్దరు న్యాయవాదుల పేర్లు బలంగా వినిపించడం ప్రారంభమయ్యాయి.
ఆది నుంచి చంద్రబాబు కేసు విషయంలో పిటిషన్లు, విచారణలు, వాయిదాలతో అయోమయం నెలకొంది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏకకాలంలో విచారణలు కొనసాగాయి. అయితే ఎక్కడ చంద్రబాబుకు ఊరట దక్కలేదు. దీంతో సీనియర్ న్యాయవాదిగా ముద్రపడిన సిద్ధార్థ లూథ్ర పలుమార్లు ఆసక్తికరమైన ట్విట్లతో అందర్నీ ఆలోచనలో పెట్టారు. ఇవి నైరాశ్యం తో కూడిన వైరాగ్యపు మాటలతో ఉండడం విశేషం. ఇప్పటివరకు నాలుగైదు సార్లు ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే తాజాగా ఆయన చేసిన ట్విట్ ఒకటి ఏపీ రాజకీయాలతో పాటు నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారింది. “తెలివైన వారిలో తెలివైనవాడు.. బలహీనులను రక్షించేవాడు.. నిరంకుశులను నాశనం చేసేవాడు.. సాత్వికులను కాపాడే వాడు ” అని చంద్రబాబును ఉద్దేశించి లూధ్ర ఆసక్తి కరెక్ట్ చేశారు. అంతేకాదు ఈ పదాలు ఎక్కడి నుంచి.. ఎవరు చెప్పారు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. తాను చెప్పిన ఈ వాక్యం “ఫర్ణమాలోని సిక్కుల పదో గురువు అమర పదాలు” అని పేర్కొన్నారు. ఈ ట్విట్ టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నాయి. విభిన్నంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం ప్రతికూలంగా స్పందించడం విశేషం.
అయితే లూధ్ర తాజా తాజా ట్విట్ పై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏదో శుభపరిణామమే జరగబోతోందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సైతం ఆయన ట్విట్ చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ లభించడం, కొన్ని రకాల ఉపశమనాలు కలగడం.. అదే సమయంలో ఈ ట్విట్ ఉండడంతో టిడిపి శ్రేణులు ఆనందంతో రియాక్ట్ అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
The 10th guru’s immortal words in Zafarnama.
Translation by Navtej Sarna pic.twitter.com/p7TDmoCfl3— Sidharth Luthra (@Luthra_Sidharth) October 31, 2023
