Varun Tej Lavanya Tripathi: వరుణ్ వెడ్స్ లావణ్య : వీరి ప్రేమకథ పెళ్లి వరకు ఎలా సాగింది? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!
మిస్టర్ మూవీ చిత్రీకరణ సమయంలో వరుణ్ తేజ్-లావణ్య మిత్రులు అయ్యారు. ఇద్దరి మధ్య ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి. బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన వీరు అంతరిక్షం టైటిల్ తో మరో మూవీ చేశారు.

Varun Tej Lavanya Tripathi: వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇటలీ వేదికగా నవంబర్ 1న వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. వీరిది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. మరి ఆ ప్రేమకు బీజం ఎక్కడ పడింది. అది పెళ్లి వరకు ఎలా వెళ్లిందో చూద్దాం.. దర్శకుడు శ్రీను వైట్ల మిస్టర్ టైటిల్ తో ఓ చిత్రం చేశారు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో వరుణ్ కి జంటగా లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ నటించారు. ఈ సినిమా అధిక భాగం ఇటలీలో షూట్ చేశారు.
మిస్టర్ మూవీ చిత్రీకరణ సమయంలో వరుణ్ తేజ్-లావణ్య మిత్రులు అయ్యారు. ఇద్దరి మధ్య ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి. బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన వీరు అంతరిక్షం టైటిల్ తో మరో మూవీ చేశారు. ఇది మంచి విజయం సాధించింది. అంతరిక్షం సినిమా చిత్రీకరణ సమయంలో స్నేహం మరో స్థాయికి చేరింది. అది ప్రేమగా మారింది. లావణ్య బర్త్ డే రోజు వరుణ్ తేజ్ స్వయంగా తన ప్రేమను వ్యక్తం చేశాడట. అప్పటికే వరుణ్ పై ప్రేమ పెంచుకున్న లావణ్య వెంటనే ఎస్ చెప్పేశారట.
అలా మొదలైన ప్రేమకథ ఐదేళ్లకు పైగా రహస్యంగా సాగింది. లావణ్య వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరవుతూ వచ్చింది. 2020లో నిహారిక వివాహం రాజస్థాన్ లో జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే లావణ్య, రీతూ వర్మ హాజరుకావడం చర్చకు దారి తీసింది. రెండేళ్ల క్రితం వరుణ్ తేజ్-లావణ్య మధ్య ఎఫైర్ నడుస్తుందన్న వార్తలు వెలువడ్డాయి. లావణ్యకు రింగ్ ఇచ్చి పెళ్లి కన్ఫర్మ్ చేసేందుకు వరుణ్ బెంగుళూరు వెళ్ళదంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం.
సడన్ గా ఈ ఏడాది నిశ్చితార్థం ప్రకటించారు. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ తంతు జరిగాక వరుణ్ తేజ్ తమ ప్రేమకథను బయటపెట్టాడు. మొదటి చూపులోనే లావణ్యకు పడిపోయానన్న వరుణ్… తానే ప్రపోజ్ చేసినట్లు చెప్పాడు. తన ఇష్టాలు ఏమిటో ఆమెకు తెలుసు. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను వాడే ఈ మొబైల్ కూడా ఆమెనే గిఫ్ట్ గా ఇచ్చిందని తన రొమాంటిల్ లవ్ స్టోరీ గురించి షార్ట్ గా చెప్పాడు. ఎట్టకేలకు లావణ్య మెగా కోడలు అయ్యారు. వరుణ్-లావణ్యల అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
