Jailer Movie Villain: జైలర్ మూవీలో ఇరగదీసిన ఈ విలన్ ఎవరు? అసలు బ్యాగ్రౌండ్ ఏంటి?
స్టార్ సినిమాలో ఒక విలన్ కి పేరు రావాలంటే అది చాలా కష్టం. అది కూడా రజినీకాంత్ లాంటి హీరో ఉన్న సినిమాలో విలన్ కి పేరు రావాలి అంటే ఆయన ఎంత కష్టపడి నటించి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు.

Jailer Movie Villain: ఈ ఆగస్టు నెల మొత్తం జైలర్ మానియా అయిపోయింది. అన్ని రాష్ట్రాలలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రజినీకాంత్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ లాంటి నటులు ఉన్న ఈ చిత్రంలో వారితో ధీటుగా నటించినా వ్యక్తి ఎవరు అంటే ఈ చిత్రం విలన్ గురించే మాట్లాడుతున్నారు అందరూ.
ఇక ఈ సినిమాలో అతి క్రూరుడు, భయంకరమైన రూపం, సుత్తితో మొహం పగులగొట్టి చంపేసే రాక్షసుడు, కళ్ళతోనే భయం పుట్టించే లుక్స్ లాంటి జనం భయపడి చచ్చే, నీచ నికృష్టపు దేశవాళీ విలన్ గా కనిపించిన నటుడి పేరు వినాయకన్. ఈ వ్యక్తిని చూసిన కొంతమందికి ఈయన ఎక్కడో చూసామే అనిపించి ఉండొచ్చు. మీకు అనిపించింది నిజమే ఎందుకంటే ఈ విలన్ ఇదివరకే ఒక తెలుగు సినిమాలో కూడా కనిపించాడు. అవును కళ్యాణ్ రామ్ అసాధ్యుడు సినిమాలో ఈ విలన్ మనకు కనిపించారు.
స్టార్ సినిమాలో ఒక విలన్ కి పేరు రావాలంటే అది చాలా కష్టం. అది కూడా రజినీకాంత్ లాంటి హీరో ఉన్న సినిమాలో విలన్ కి పేరు రావాలి అంటే ఆయన ఎంత కష్టపడి నటించి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అంతలా అద్భుతంగా నటించి ‘జైలర్’ సక్సెస్ కి వినాయకన్ కూడా ప్రధాన కారకుడయ్యాడు.
ఇంతకీ ఎవరీ వినాయకన్ అంటే- నటుడు, గాయకుడు, స్వరకర్త, నాట్యాచారుడు- ఇన్ని కళలున్నాయి ఈ మలయాళీ ఆర్టిస్టులో. 1995 లో ‘మాంత్రికం’ లో అతిధి పాత్రతో నట వృత్తిని ప్రారంభించాడు . ఆ తర్వాత రెండు సినిమాల్లో సహాయ పాత్ర, కమెడియన్ పాత్రా పోషించాడు. తర్వాత ‘స్టాప్ వయొలెన్స్’, ‘ఛోటా ముంబాయి’ సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు. మొత్తం 53 మలయాళ సినిమాలు, 8 తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా (‘అసాధ్యుడు’- 2006), ఒక హిందీ సినిమా నటించాడు.
అంతేకాదు ఈయనకి 2016 సంవత్సరంలో ‘కమ్మటి పాదం’ లో నటనకి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది. సినిమాల్లోకి రావడానికి ముందు ‘బ్లాక్ మెర్క్యురీ’ అనే డాన్స్ గ్రూపుని నిర్వహించేవాడు. మైకేల్ జాక్సన్ ని ఇమిటేట్ చేసేవాడు. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగాడు.
ముఖ్యంగా జైలర్ సినిమాలో విగ్రహాల స్మగ్లర్ వర్మగా విలన్ పాత్రలో మెరిసి సూపర్ స్టార్ డం తెచ్చుకునేశారు. పాత్ర లోతుపాతుల్లోకి వెళ్ళిపోయి, పాత్రనంతా కళ్ళల్లో నింపుకుని- అక్కడ్నించీ ఒడలు జలదరించేలా పాత్రని ఎలివేట్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చిన దగ్గరనుంచి ఈయనకి అన్ని భాషలలోనూ అవకాశాలు వస్తాయి అని అలానే ఈయన ఏకంగా పాన్ ఇండియా విలన్ అయిపోయారని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
