Balakrishna: ఆనాడు బాల‌కృష్ణను కాపాడింది ఎవరు?

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏం జరిగిందో అన్నదానిపై పోసాని కృష్ణములవి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

  • Written By: Dharma
  • Published On:
Balakrishna: ఆనాడు బాల‌కృష్ణను కాపాడింది ఎవరు?

Balakrishna: బాలకృష్ణ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ వేదికగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ శాసనసభలో వినూత్న స్థాయిలో నిరసన చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మీసం మెలేసి హెచ్చరికలు జారీ చేశారు. ఈలలు గోల తో రచ్చ రచ్చ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా శాసనసభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన వ్యవహార శైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో బాలకృష్ణ వైసిపికి టార్గెట్ అయ్యారు. తాజాగా పోసాని కృష్ణ మురళి స్పందించారు. బాలకృష్ణ తీరును ఎండగట్టారు. నాడు ఆయన ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావించారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏం జరిగిందో అన్నదానిపై పోసాని కృష్ణములవి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ తన రివాల్వర్ తో ఇద్దరినీ కాల్చాడని.. ఆ సమయంలో భయపడి పురందేశ్వరి దగ్గరికి ఏడుస్తూ బాలకృష్ణ వచ్చాడని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు తరువాత దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వచ్చారని.. మా తమ్ముడు ఇద్దరినీ కాల్చాడని.. వారి పరిస్థితి విషమంగా ఉందని.. మీరే కాపాడాలి అన్నయ్య అంటూ రాజశేఖర్ రెడ్డిని వేడుకున్నారని పోసాని గుర్తు చేశారు. నాడు రాజశేఖర్ రెడ్డి కనికరం చూపడం వల్లే బాలకృష్ణ బయటపడ్డారని పోసాని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు పురందేశ్వరి, బాలకృష్ణులు చంద్రబాబు అరెస్టు విషయంలో అతిగా స్పందిస్తున్నారని పోసాని తప్పు పట్టారు. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన, తదుపరి పరిణామాలపై పోసాని కృష్ణ మురళి క్లారిటీ ఇవ్వడం విశేషం. అప్పట్లో రాజకీయంగా వైరం ఉన్నా.. వ్యక్తిగతంగా దగ్గరగా ఉండేవారని ఈ ఉదాంతం తెలియజేస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ రాజకీయ పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. పగ, ప్రతీకారాలకు చిరునామాగా మారాయి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సాయం కోరిన పురందేశ్వరి, బాలకృష్ణ వైఖరి పై మాట్లాడిన క్రమంలో పోసాని గతంలో ఉన్న పరిస్థితులను తెలియజేశారు. ఇప్పుడు కూడా రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు అన్నట్టు నేతలు ప్రవర్తిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికైతే పోసాని రాజకీయంగా ఆరోపణలు చేసినా.. అవి ఆలోచింపజేస్తున్నాయి.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు