Utti: గతంలో మన ఇంట్లో ఉండే ఉట్టి గుర్తుందా? దాంతో ఏంటి లాభాలు? ఎందుకు పెట్టారు
ఉట్టి మీద దాచిన పాలు, పెరుగు కోసం మనం ఆరాట పడేవాళ్లం, అప్పుడప్పుడు పిల్లులు కూడా దాని మీదకెగిరి పాలు, పెరుగు తాగేవి. ఇలా మన చిన్ననాటి జ్ణాపకాలు గుర్తుకొస్తే అదో గమ్మత్తుగా ఉండటం మామూలే.

Utti: ఓ తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఎప్పటికైనా గతించిన రోజులే బాగుంటాయి అని. ఇది నిజంగా ఎంతో అద్భుతమైన మాట. ఇందులో చాల నిజం దాగి ఉంది. మనకు చిన్నప్పటి రోజులు యాదికొస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది. మాటల్లో కూడా అప్పటి రోజులు ఎలా ఉండేవని గుర్తు చేసుకుంటూ సరిగా అప్పటి రోజుల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. అనుబంధాలు, ఆత్మీయతలకు పెట్టింది పేరు. అప్పుడు ఇప్పటిలా ఫోన్లు లేవు. మాటలే ఉండేవి. మనుషులే ఉండేవారు. రాత్రయిందంటే ఒక చోట కూడి అన్ని గుర్తు చేసుకునే వాళ్లం. కానీ ఇప్పుడే ఆనాటి గుర్తులేవి?
మనం చిన్నప్పుడు మన ఇంటికి ఉట్లు ఉండేవి. వాటి మీద పాలు, పెరుగు, చల్ల లాంటివి దాచేవారు. అవి పోసుకుని అన్నం తింటే హాయిగా అనిపించేది. తిన్న నోరుకూడా రుచిగా ఉండేది. ఇప్పుడు ఉట్లు లేవు. ఎక్కడా కానరావు. ఆనాటి జీవితమే ఎంతో మజా గొలిపేది. ఉమ్మడి కుటుంబంలో మస్తు సంబరాలు ఉండేవి. అందరిలో అనుబంధాలు బాగుండేవి. ఆప్యాయతలు వెల్లివిరిసేవి.
ఉట్టి మీద దాచిన పాలు, పెరుగు కోసం మనం ఆరాట పడేవాళ్లం, అప్పుడప్పుడు పిల్లులు కూడా దాని మీదకెగిరి పాలు, పెరుగు తాగేవి. ఇలా మన చిన్ననాటి జ్ణాపకాలు గుర్తుకొస్తే అదో గమ్మత్తుగా ఉండటం మామూలే. ఆనాటి పాత మధురాలు మనకు ఇప్పటికి కూడా మనకు అనుభూతులు పంచుతూనే ఉంటాయి. ఉట్టి మీద దాచిన పెరుగు అన్నంలో వేసుకుని తింటే ఆ రుచికి ఎంతో పొంగిపోయేవాళ్లం.
ఇప్పుడు ఉట్లు లేవు. పెరుగు లేదు. అంతా ప్యాకెట్ పెరుగు. అది తిన్నా గానీ రుచి ఉండదు. తినాలని అనిపించదు. అప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చేసే పెరుగంటే అందరికి ఇష్టమే. దాని కోసం చివరగా వేచి చూసే వాళ్లం. పెరుగు వేసుకుని తింటేనే మనకు తిన్నట్లు అనిపించేది. ఒక్క ముద్ద అయినా పెరుగుతో తింటే ఆ సుఖమే వేరుగా ఉండేది.
పాలు, పెరుగు ఉట్టిమీద పెడితే పిల్లుల బాధ ఉండేది కాదు. కింద పెడితే పిల్లులు తాగేవి. దీంతో వాటికి అందకుండా ఉట్టిమీద పెట్టేవారు. ఉట్టిమీద పెడితే దాని రుచి వేరే ఉండేది. ఇలా ఉట్టితో మనకు లాభాలు ఉండేవి. ఉట్టిని కట్టుకుని పెరుగును మజా చేసేవారం.