C. S. R. Anjaneyulu: సి.యస్.ఆర్. ఆంజనేయులు.. తెలుగు టాకీలు పుట్టకముందే రంగస్థలం పై శ్రీకృష్ణుడిగా, భవానీశంకరుడిగా , రామదాసుగా, తుకారాంగా ఇలా అనేక పాత్రలను సమర్ధవంతంగా పోషించి యావదాంధ్రా ప్రేక్షకులను తన వెావిధ్యమైన నటనతోనూ, గానంతోనూ ఉర్రూతలూగించిన గొప్ప నటుడు. మరి సి.యస్.ఆర్ గురించి కొన్ని విషయాలు మీ కోసం.

C. S. R. Anjaneyulu
సి.యస్.ఆర్. ఆంజనేయులు గుంటూరుజిల్లా నరసరావుపేటలో 1907వ సంవత్సరంలో జన్మించారు. పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు, ఎస్సెల్సీ వరకూ, చదివి సహకారశాఖలో ఉద్యోగి అయ్యారు. కాని ఆ ఉద్యోగాన్ని వదులుకుని తను మనసుపడ్డ నాటకరంగానే జీవనోపాధిగా ఎన్నుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. మరెన్నో అవమానాలు పడ్డారు. అయినా ఆయన కసితో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.
Also Read: తొలి తెలుగు హీరోయిన్ స్టేజ్ పైనే జన్మించింది !
కాగా 1933లో ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారు నిర్మించిన ‘రామదాసు’లో కథానాయకునిగా చిన వయసులో భక్తిరసాని అద్భుతంగా రక్తికట్టించారు. ఆ తరువాత 1936లో గ్లామర్, గానం, నటన కలబోసిన భారత కథానాయకుడు శ్రీకృష్ణునిగా ”ద్రౌపదివస్త్రాపహరణం” హీరోగా శభాష్ అనిపించుకున్నారు. 1939లో పి.పుల్లయ్య రూపొందించిన ‘వెంకటేశర మహాత్మ్యం’లో కథానాయకుడు శ్రీనివాసుని పాత్రకు ప్రాణం పోసారు.
తొలినాటి సినిమాల్లో ‘చూడమణి’ చిత్రంలో పోషించిన పాత్ర చాలా బాగుంటుంది. సి.యస్.ఆర్ లోని విలక్షణ నటనా విశరూపానికి అవకాశం ఇచ్చింది మాత్రం మాయాబజార్ సినిమానే. ‘మాయాబజార్’లో శకుని పాత్ర ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి వుండనే వుందిగా” అని కథను మంచి రసపట్టులో నడిపించి ‘శకుని వుంటేచాలు, శనిఏలనని కదా’ అనే పద్యంతో ఆకట్టుకునే వారు.
Also Read: ఎన్టీఆర్ ని బీట్ చేసిన చిరంజీవి మొదటి సినిమా… స్టార్ కాకముందే చిరు అద్భుత రికార్డు!