Savita Arjun Case: భార్యల స్వార్థం.. భర్తలు బలి!
పురాణాల్లో స్త్రీ ఒక్కరినే ప్రేమిస్తుంది. ఒక్కరితోనే జీవితం పంచుకుంటుంది. ఒక్కరినే భర్తగా చేసుకుంటుందని అని ఉంటుంది. కానీ ఇప్పుటి తరం మహిళలు ఇలా పరాయి మగాడి మోజులో పడి భర్త చివరకు ఇలా మోసం చేయడం నిజంగా దారుణం.

Savita Arjun Case: భర్తలు టార్చర్ పెడుతున్నారు.. వేధిస్తున్నారు.. తాగొచ్చి హించిస్తున్నారు.. అదనపు కట్నం కావాలని రాచి రంపానపెడుతున్నారు.. ఇవీ మహిళలపై వేధింపులు, గృహ హింస గురించి వినిపించే పదాలు. ఇలా వేధింపులక గురయ్యే మహిళల కోసం ప్రభుత్వాలు చట్టాలు కూడా రూపొందించాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. భార్యల స్వార్థానికి భర్తలే బలయ్యే పరిస్థితి వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇన్నాళ్లూ భార్యలు పోలీస్టేషన్‌కు, కోర్టులకు ఎక్కితే ఇకపై భర్తలు ఎక్కాల్సి వస్తోంది. ప్రతిభ, ఆసక్తి ఉన్న భార్యలను ప్రోత్సహిస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, కష్టాలు తీరుతాయని భావిస్తున్న భర్తలకు భార్యలు షాక్ ఇస్తున్నారు. భార్య భవిష్యత్ కోసం భర్త కష్టపడుతుంటే.. కొంతమంది ఉన్నత చదువులు అని వెళ్లి.. భర్తను దూరం చేసుకుంటున్నారు. మరొకరితో వెళ్లిపోతున్నారు. భర్త చేసిన త్యాగానికి కనీసం విలువ కూడా లేకుండా పోతోంది.
కష్టపడి భార్యని చదివిస్తే..
గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనేది ఆమె కళ. పెళ్లికి ముందు అందరు అమ్మాయిలు కనే సాధారణ లక్ష్యం ఆమెకు కూడా ఉంది. అయితే అర్ధం చేసుకునే భర్త రావడం ఆమెకు కలిసి వచ్చింది. అంతేకాదు తన లక్ష్యాన్ని ఆపకుండా ఆమెను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఏకంగా ఆమెను సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌ను చేశాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తన భార్యకు గొప్ప ఉద్యోగం వచ్చిందని సంతోషించేలోపు ఆమె ఆ భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తకు కన్నీరుని మిగిలిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూర్‌లో జరిగింది. అంతేకాదు అతను వరకట్నం కావాలని వేధిస్తున్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో జైలుకు వెళ్లిన అతను ఇటీవలే తిరిగి వచ్చాడు. బెయిల్ మీద బైటకి వచ్చిన అతనికి ఇప్పుడు ఉద్యోగం కూడా పోయింది. చివరికి అతనికి పోలీసుల మద్దతు కూడా లభించట్లేదని వాపోయాడు. తన భార్య విడాకులు కోరుతున్నట్లు అలా జరగని పక్షంలో చంపేస్తానని బెదిరిస్తున్నారు.
నర్సింగ్ చదివిస్తే.. .
ఉత్తరప్రదేశ్‌కే చెందిన అర్జున్ కూడా కాన్‌పూర్‌కు చెందిన అలోక్ తరహాలోనే తన భార్య సవితను నర్సింగ్ చదివించాడు. ఇటీవల ఆమెకు ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. తర్వాత సవిత ప్రవర్తనలో మార్పు వచ్చింది. నల్లగా ఉన్నావని అవమానించింది. కొత కాలానికి తన స్టేటస్‌కు సరిపోవని చెప్పింది. ఈ విషయంలో బాధపడుతుండగానే వదిలేసింది. దీంతో అర్జున్ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు.
పరాయి మగాడి మోజులోపడి..
పురాణాల్లో స్త్రీ ఒక్కరినే ప్రేమిస్తుంది. ఒక్కరితోనే జీవితం పంచుకుంటుంది. ఒక్కరినే భర్తగా చేసుకుంటుందని అని ఉంటుంది. కానీ ఇప్పుటి తరం మహిళలు ఇలా పరాయి మగాడి మోజులో పడి భర్త చివరకు ఇలా మోసం చేయడం నిజంగా దారుణం. భార్యే ప్రపంచంగా బ్రతికిన వారికి చివరికి ఇలాంటి గతి పట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగం రాకముందు ఒకలా.. ఉద్యోగం వచ్చాక ఒకలా మారిపోవడం మహిళల్లో ద్వంద్వ వైఖరిని, స్వార్థాన్ని బయటపెడుతుంది.
