Rao Ramesh: తన నటన తో ప్రకాష్ రాజ్ కి పోటీ ఇస్తున్న నటుడు…

అయితే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న రావు రమేష్ మాత్రం ఇండస్ట్రీ కి రాకముందు చాలా భాదలు పడ్డాడు.ఇక ఈయన నటుడు గా చేసిన మొదటి సినిమా గమ్యం. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకులని మెప్పించాడనే చెప్పాలి.

  • Written By: V Krishna
  • Published On:
Rao Ramesh: తన నటన తో ప్రకాష్ రాజ్ కి పోటీ ఇస్తున్న నటుడు…

Rao Ramesh: ప్రస్తుతం ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు పొందిన నటుల్లో రావు రమేష్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాల్లో క్యారెక్టర్లు ప్రేక్షకులకి చాలా బాగా గుర్తిండిపోతాయి. ఈయన చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి.ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే ఒక నటుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ నటుడు చేసే నటన మీద డిపెండ్ అయి మాత్రమే ఆయన కి క్యారెక్టరని ఇవ్వడం జరుగుతుంది. నిజానికి సినిమాల్లో ఒక క్యారెక్టర్ చేయడానికి దాంట్లో అవకాశం రావడానికి చాలా మంది చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ లో ఒక్కసారి అవకాశం వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు తన టాలెంట్ ని చూపించుకోవాలని చూస్తూ ఉంటారు.

అయితే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న రావు రమేష్ మాత్రం ఇండస్ట్రీ కి రాకముందు చాలా భాదలు పడ్డాడు.ఇక ఈయన నటుడు గా చేసిన మొదటి సినిమా గమ్యం. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకులని మెప్పించాడనే చెప్పాలి. నిజానికి ఈయన చేసిన ఆ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడం తో ఆయనకి కొత్త బంగారు లోకం సినిమా నుంచి మంచి ఛాన్స్ వచ్చింది ఆ సినిమాలో లెక్చరర్ గా చేసి మంచి నటన ని కనబర్చాడు.ఇక దాంతో ఇండస్ట్రీ లో ఒక మంచి నటుడు ఉన్నాడు అని చాలా మందికి తెలిసింది.ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో నటుడు గా మరో మెట్టు పైకి ఎక్కారనే చెప్పాలి.ఈ సినిమాలో తాను డిఫరెంట్ క్యారెక్టర్ పోషించడమే కాకుండా అందులో జీవించాడనే చెప్పాలి.ఇక ఆ తర్వాత ఆయన కి వరుసగా అవకాశాలు వచ్చాయి ఇక కొందరు అయితే ప్రకాష్ రాజ్ ని రీప్లేస్ చేసే నటుడు ఇండస్ట్రీ కి దొరికాడు అంటూ ఆయన్ని పొగిడారు.ఇక రావు రమేష్ లెజండరీ నటుడు అయిన రావు గోపాలరావు కొడుకు అయి ఉండి కూడా ఇండస్ట్రీ కి రావడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.మొత్తానికి ఇప్పుడు వాళ్ల నాన్న పేరు ని నిలబెడుతూ ఇండస్ట్రీ లో మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు