Rajeev Kanakala- Suma: సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి పెళ్లిళ్లపై చాలా మందికి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఎంత స్పీడ్ గా ప్రేమలో పడతారో.. అంతే స్పీడ్ గా విడిపోతారనే భావన ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ టీవీ రంగంలో అడుగుపెట్టి.. ఆ తరువాత సినిమాల్లో కొనసాగుతున్న రాజీవ్ కనకాల, సుమలు మాత్రం అలా కాదు. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు కలిసే ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆదర్శ జంటగా కొనసాగుతున్న వీరు సందర్భం వచ్చినప్పుడల్లా తమ లవ్ స్టోరీ గురించి చెబుతారు. అయితే రాజీవ్ కనకాల తన లవ్ ను ముందుగా సుమకు ప్రపోజ్ చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ తరువాత ఏం జరిగిందంటే..?

Rajeev Kanakala- Suma
రాజీవ్ కనకాల, సుమ లు ప్రస్తుతం ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో కొనసాగుతున్నారు. రాజీవ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పొజిషన్లో ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినా వెబ్ సిరీసులతో మాత్రం బిజీగా మారారు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేశ్ ‘మహర్షి’ సినిమాలో రాజీవ్ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. అటు సుమ నాటి నుంచి నేటి వరకు యాంకర్ గా అన్ని విధాలుగా ఆకట్టుకుంటున్నారు. ఆమె తరువాత ఎంతో మంది యాంకర్లు వచ్చినా.. సుమ లేని సినీ ఫంక్షన్ ను ఊహించుకోలేం అని కొందరు ప్రముఖులు పేర్కొంటారు.
సినీ ఇండస్ట్రీకి చెందిన వీరిద్దరు మొదటి సారి దూరదర్శన్ సీరియల్ ‘జీవనరాగం’తో కలిశారు. 1991లో టీవీ రంగంలో అడుగుపెట్టిన రాజీవ్ 1994లో సుమను చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక జీవన రాగం సీరియల్ లో ఐదురోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ లో సుమ నటించింది. ఆమెను చూడగానే మనసు పారేసుకున్న ట్లు రాజీవ్ తెలిపారు. దీంతో ఆలస్యం చేయకుండా సుమకు తన ప్రేమ విషయాన్ని రాజీవ్ చెప్పాడు. కానీ సుమ మొదట్లో ఒప్పుకోలేదు.

Rajeev Kanakala- Suma
ఒకరోజు సుమ షూటింగ్ సెట్ కు వచ్చి తిరిగి వెళ్లేందుకు రెడీ అయింది. అయితే ఆ రోజు ఆమె కారు తీసుకురాలేదు. దీంతో ఆటోలో వెళ్తాను అని చెప్పింది. కానీ ప్రొడక్షన్ వాళ్లు రాజీవ్ కార్లో వెళ్ళమని సలహా ఇచ్చారు. దీంతో రాజీవ్ కారెక్కిన తరువత వీరి ప్రేమ మొదలైందని అంటారు. అలా వీరు ప్రేమించుకొని 1999 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు అన్యోన్యంగా ఉంటున్నారు. కానీ కొందరు వీరు మిగతా వాళ్లలాగే ఈ జంట కూడా విడాకులు తీసుకుంటుంది అని ప్రచారం చేశారు. కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అని సుమ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చింది.