Rajamouli: రాజమౌళి అంత పిసినారి నా?

ఎంత డబ్బు సంపాదించినా రాజమౌళి ఎవరికీ సాయం చేసినట్లు కనిపించలేదని కొందరు ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది ఎంతో కొంత సాయం చేస్తున్నారని, కానీ డైరెక్టర్ గా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినిమాకు చెందిన వాళ్లను పట్టించుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు.

  • Written By: SS
  • Published On:
Rajamouli: రాజమౌళి అంత పిసినారి నా?

Rajamouli: తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గురించి మొన్నటి వరకు చర్చ సాగింది. ఆస్కార్ అవార్డు తీసుకురావడంలో రాజమౌళి చేసినకృషి అంతా ఇంతా కాదు. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారన్న విమర్శలు వచ్చాయి. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లిన ఆయనను విమర్శించిన వారి కంటే మెచ్చుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో రాజమౌళి గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతో డబ్బు సంపాదించిన రాజమౌళి ఇతరులకు సాయం చేసినట్లు ఎక్కడా కనిపించలేదని కొందరు అంటున్నారు. ఆయన అలా చేయడానికి ఓ పెద్ద కారణం ఉందట. అదేంటంటే?

ఇప్పుడున్న డైరెక్టర్లలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది రాజమౌళి అని మాత్రమే చెప్పొచ్చు. ఒక్కోసినిమాకు ఆయన రూ.20 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. ఇదే కాకుండా సినిమాల్లో వచ్చిన లాభాల్లో వాటా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆయన హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్ అయినవే. దీంతో ఆయన డబ్బును బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

ఎంత డబ్బు సంపాదించినా రాజమౌళి ఎవరికీ సాయం చేసినట్లు కనిపించలేదని కొందరు ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది ఎంతో కొంత సాయం చేస్తున్నారని, కానీ డైరెక్టర్ గా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినిమాకు చెందిన వాళ్లను పట్టించుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. కరోనా కాలంలోనూ రాజమౌళి ఎటువంటి సాయం చేయలేదని, డబ్బు సంపాదన దేని కోసమని కొందరు రకరకాల పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

అయితే దీనిపై కొందరు జక్కన్న ఫ్యాన్ష్ రియాక్టయ్యారు. రాజమౌళి ఘనత తెలియక అలాంటి పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. చాలా మంది పది రూపాయల సాయం చేసి ఎంతో పెద్ద సాయం చేసినట్లు క్రెడిట్ కొట్టేస్తున్నారని అంటున్నారు. కానీ రాజమౌళి క్యారెక్టర్ అలాంటిది కాదంటున్నారు. ఆయన చేసే సాయం ఇతరులకు చెప్పుకోవడం ఇష్టం లేదని అంటున్నారు. తాను సాయం చేసినట్లు పది మందికి చెప్పుకుంటే దానిని సాయం అని ఎలా అంటారు? అని కౌంటర్ వేస్తున్నారు.

అలాగే కొందరికి సాయం చేస్తూ చాలా మంది అవసరం లేని వారు సైతం రాజమౌళి వెంట పడుతారని చెబుతున్నారు. అందువల్ల రాజమౌళి సాయం విషయంలోకొంత కఠినంగా ఉంటారని అన్నారు. అయితే తాను తీసే సినిమాతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా సినీ కార్మికులకు 3 సంవత్సరాల పాటు పని ఉంటుందని, ఇది కదా సాయం చేయడమంటే.. అని జక్కన్న ఫ్యాన్స్ చెబుతున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు