Pawan Kalyan: తన సినిమాల్లో పవన్ కి ఇష్టమైన సాంగ్… అర్ధరాత్రి 2 గంటల వరకు వెయిట్ చేసి మరీ!
హీరోయిన్ హీరో మధ్య చిన్న హగ్, ముద్దు సన్నివేశం లేకుండా క్లీన్ గా సాగుతుంది తొలిప్రేమ. యూత్ ని ఒక ఊపు ఊపిన తొలిప్రేమ పవన్ కళ్యాణ్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ కి జంటగా కీర్తి రెడ్డి నటించింది.

Pawan Kalyan: 1996లో పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అనంతరం గోకులంలో సీత చేశారు. మూడో చిత్రం సుస్వాగతం మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే పవన్ కళ్యాణ్ కి స్టార్ డమ్ తెచ్చిన సినిమా తొలిప్రేమ. 1998లో దర్శకుడు కరుణాకరన్ తొలిప్రేమ తెరకెక్కించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన తొలిప్రేమ టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. లవ్, రొమాన్స్, కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
హీరోయిన్ హీరో మధ్య చిన్న హగ్, ముద్దు సన్నివేశం లేకుండా క్లీన్ గా సాగుతుంది తొలిప్రేమ. యూత్ ని ఒక ఊపు ఊపిన తొలిప్రేమ పవన్ కళ్యాణ్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ కి జంటగా కీర్తి రెడ్డి నటించింది. కరుణాకరన్ ఈ కథ పవన్ కి వినిపించేందుకు 8 నెలలు ఎదురు చూశారట. కాగా ఈ చిత్రంలోని ఓ సాంగ్ పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టం అట.
”ఈ మనస్సే” సాంగ్ ఎలా వచ్చిందో చూసేందుకు పవన్ కళ్యాణ్ గంటల తరబడి రామానాయుడు స్టూడియోలో ఎదురు చూశాడట. తొలిప్రేమ షూటింగ్ పూర్తయ్యాక రామానాయుడు స్టూడియోలో ఎడిటింగ్ చేస్తున్నారట. స్టూడియోకి రాత్రి 8 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వెళ్లారట. కరుణా… ‘ఈ మనస్సే’ సాంగ్ ఒకసారి చూపించు. ఎలా వచ్చిందో చూద్దాం అన్నారట. ఎడిటింగ్ జరుగుతుంది. కాసేపు వెయిట్ చేయాలని అన్నారట.
ఆ సాంగ్ ఎడిటింగ్ కంప్లీట్ కావడానికి రాత్రి 2 గంటలు అయ్యిందట. బయటకు వెళ్లి చూస్తే… పవన్ కళ్యాణ్ అక్కడే కూర్చొని ఉన్నారట. అప్పుడు సాంగ్ చూసి చాలా బాగా చేశావ్. అని కరుణాకరన్ ని మెచ్చుకొని ఇంటికి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కరుణాకరన్ స్వయంగా చెప్పాడు. తొలిప్రేమ అనంతరం ఏడేళ్ల తర్వాత 2005లో వీరి కాంబినేషన్ లో బాలు తెరకెక్కింది. మరలా వీరు కలిసి పని చేయలేదు.
