Maharshi Movie: మహర్షిలో పొలం దున్నే సీన్.. మహేష్ కోసం ఏసీలో ఇలా తీశారట!
అయితే ఇటీవల మహేష్ బాబు శ్రీనివాసరావు అనే జర్నలిస్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో సుకుమారం ఉన్న హీరో ఆయన అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు..ఇందులో ఆయన ఓ షాకింగ్ విషయం చెప్పాడు. మహేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ‘మహర్షి’ ఒకటి. ఇందులో ఆయన వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. తన స్నేహితుడి కోసం అమెరికాను వదిలి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తాడు. చెట్ల కింద కూర్చొని కంప్యూటర్ కొడుతూ కనిపిస్తాడు.

Maharshi Movie: సినిమాల్లో ఒక్కసారి హీరో అయ్యారంటే చాలు.. జీవితమే మారిపోతుంది.. డబ్బుకు డబ్బు.. రాచ మర్యాదలు.. ప్రతీ సినిమాలో హీరోనే హైలెట్ గా నిలుస్తారు. లవ్, ఎమోషన్ తో పాటు కొన్ని హార్డ్ సీన్లను కూడా చేయాల్సి ఉంటుంది.. కొన్ని సీన్స్ అద్భుతంగా రావాలంటే సాహసాలు కూడా చేయాల్సి ఉంటుంది.. ఇలా కొన్ని ఫీట్లు చేసే క్రమంలో హీరోలు గాయాలపాలైన ఘటనలూ ఉన్నాయి… అయితే టెక్నాలజీ ఎక్కువవుతున్న కొద్దీ హీరోలు పడే కష్టం తగ్గిపోతుంది.. ఏమాత్రం చెమటోడ్చకున్నా.. వారు ఎంతో చేసినట్లుగా గ్రాఫిక్స్ తో చూపిస్తున్నారు. కాలు కదిపితే చాలు.. ఎంతో పెద్ద ఫైట్ చేసినట్లుగా తెలుస్తుంది.. ఈ టెక్నాలజీని ఓ హీరో బాగా వాడేకుంటున్నాడు.. ఏమాత్రం కష్టపడకుండా ప్రతీ సీన్ ను ఇలా సాంకేతికతతో పూర్తి చేస్తున్నాడు. కొన్ని సినిమాల్లో ఆయన చేసిన ఈ ప్రయోగాల గురించి ఓ జర్నలిస్టు బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు స్పెషల్ ఇమేజ్ ఉంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆయన దశాబ్దాల కాలంగా స్టార్ హీరోగానే కొనసాగుతున్నాడు. మహేష్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లు సున్నీతమైన హీరో పాత్రలే చేశారు. మహేష్ తో ఎంట్రీ ఇచ్చిన వాళ్లు యాక్షన్ మూవీస్ తో అదరగొట్టారు. కానీ ఈ యంగ్ హీరోకు సాఫ్ట్ క్యారెక్టర్ ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనను మాస్ హీరోగా చూడాలని చాలా మంది ఫ్యాన్స్ సందడి చేశారు. దీంతో త్రివిక్రమ్ ‘అతడు’ నుంచి మహేష్ స్టైల్ మార్చేశాడు. అప్పటి నుంచి ఈ సూపర్ స్టార్ మాస్ మేకింగ్ తోనే ఆకట్టుకుంటున్నాడు.
అయితే ఇటీవల మహేష్ బాబు శ్రీనివాసరావు అనే జర్నలిస్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో సుకుమారం ఉన్న హీరో ఆయన అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు..ఇందులో ఆయన ఓ షాకింగ్ విషయం చెప్పాడు. మహేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ‘మహర్షి’ ఒకటి. ఇందులో ఆయన వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. తన స్నేహితుడి కోసం అమెరికాను వదిలి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తాడు. చెట్ల కింద కూర్చొని కంప్యూటర్ కొడుతూ కనిపిస్తాడు.
ఈ సినిమాలో మహేష్ పలు ఆకట్టుకునే సీన్లలో నటించాడు. ఓ వైపు సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపిస్తూనూ మరోవైపు పొలం దున్నే రైతుగా ఆకర్షిస్తాడు. ఓ రైతుతో పొలానికి వెళ్లిన రైతు తనతో కలిసి మట్టి పిసుకుతాడు.. ఆ తరువాత ఎద్దులతో పొలం దున్నుతాడు. దీంతో మహేష్ ను ఈ సీన్ లో చూసి మండుటెండలో ఆయన ఎంత కష్టపడ్డాడో పాపం.. అని అనుకున్నారు. ఎంతో సుకుమారంగా ఉండే ఆయన ఇలాంటి కష్టం చేయడం చూసి ఆశ్చర్యపోయారు.
కానీ వెండితెరపై కనిపించింది వేరు.. షూటింగ్ సమయంలో జరిగింది వేరు.. వాస్తవానికి మహేష్ కొన్ని హార్డ్ సీన్లు చేయడానికి అస్సలు ఒప్పుకోడట. దీంతో డైరెక్టర్లు మహేష్ పరిస్థితిని ముందే అర్థం చేసుకొని ఆయనకు అనుగుణంగా సీన్స్ తీస్తారట. ఈ సీన్ తీయడానికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి టెక్నాలజీని బాగా వాడుకున్నాడట. పొలం దున్నే సీన్ ను ఏసీ రూంలో సెట్ చేయించాడట. అంటే ఓ పెద్ద రూంలో ఈ సీన్ ను సెట్ చేయించి.. అందులోకి ఎద్దులను కూడా తీసుకెళ్లారట. ఇదంతా మహేష్ కు చెమట రాకుండా ఉండడానికేనని అనుకుంటున్నారు.
ఇక మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో కొన్ని సీన్లలో ఫైట్లు కూడా ఉన్నాయి. అయితే మహేష్ ఎక్కువగా కష్టపడకుండా సాఫ్ట్ ఫైట్లను మాత్రమే సెట్ చేయించారట. మహేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఉండే వ్యక్తులను సెట్ చేయించి సీన్స్ తీశారట. ఒకప్పుడు సీన్ బాగా రావాలంటే పులులతో నేరుగా ఫైట్ చేసిన హీరోలు ఉన్నారు. కానీ ఇప్పటి హీరోలు అలా లేరు.. వారి మార్కెట్ ఎక్కువగా ఉన్నందు.. తామేం కష్టపడకున్నా సినిమా జనాల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారు. అయితే ఇది అందరికి వర్తించదు.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video: