రోజూ ఇదే తంతు.. ఎప్పుడు చూసినా కేకలు, అరుపులు !

Kota Srinivasa Rao: అవి ‘ప్రతిఘటన’ సినిమా విడుదలైన రోజులు. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు నటనకు విశేష స్పందన వచ్చింది. ఇండస్ట్రీలో కూడా కోట శ్రీనివాసరావుకి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో, ఆయనకు వరుసగా సినిమాలు వచ్చాయి. అయితే, ఆ సమయంలో ఆయన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడేం చేయాలి ? ఉద్యోగం మానేసి వెళ్తే.. ఇక ఆ తర్వాత అవకాశాలు రాకపోతే ? అందుకే, సినిమాల్లో గొప్ప పేరు […]

  • Written By: SRK
  • Published On:
రోజూ ఇదే  తంతు.. ఎప్పుడు చూసినా కేకలు, అరుపులు !

Kota Srinivasa Rao: అవి ‘ప్రతిఘటన’ సినిమా విడుదలైన రోజులు. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు నటనకు విశేష స్పందన వచ్చింది. ఇండస్ట్రీలో కూడా కోట శ్రీనివాసరావుకి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో, ఆయనకు వరుసగా సినిమాలు వచ్చాయి. అయితే, ఆ సమయంలో ఆయన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు.

Kota Srinivasa Rao

Kota Srinivasa Rao

ఇప్పుడేం చేయాలి ? ఉద్యోగం మానేసి వెళ్తే.. ఇక ఆ తర్వాత అవకాశాలు రాకపోతే ? అందుకే, సినిమాల్లో గొప్ప పేరు వచ్చినా ఆయన తన ఉద్యోగాన్ని మానలేక పోయారు. కానీ, ఆయన పని చేస్తోన్న బ్యాంక్‌ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉండేది. కేవలం కోట గారిని చూడటానికే జనం బారులు తీరేవాళ్ళు. ఆ బ్యాంక్ హైదరాబాద్ లోని నారాయణగూడ చౌరస్తాలో ఉండేది.

పైగా ఆ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆనుకునే అప్పట్లో దీపక్‌ మహల్‌ అనే పేరుతో సినిమా థియేటర్ కూడా ఉండేది. ఇక కోట కీలక పాత్రలో నటించిన ‘ప్రతిఘటన’ సినిమా కూడా ఆ థియేటర్ లోనే రిలీజైంది. సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులంతా బ్యాంక్ కి వచ్చి కోట గారిని చూసి వెళ్లడం అలవాటు అయింది. దాంతో ఆ బ్యాంక్ లో పనులు మధ్యలోనే ఆగిపోయేవి.

నిత్యం వందల మంది జనం, వాళ్ళను కంట్రోల్ చేయడానికి బ్యాంక్ సిబ్బంది తమ పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వచ్చేది. రోజూ ఇదే తంతు. ఎప్పుడు చూసినా ‘కోట శ్రీనివాసరావు, కోట శ్రీనివాసరావు’ అంటూ కేకలు విజిల్స్ వినబడేవి. ఆ అల్లరి, ఆ గోలను చూడలేక, ఆ బ్యాంక్ మేనేజర్ పలుమార్లు తలా బాదుకున్నారట.

Also Read: Actress Samantha: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం

ఆయనకు కోట అంటే అభిమానం. నేరుగా ఆయనకు ఏమి చెప్పలేరు. కానీ ఓ రోజు ఉదయమే.. కోట కోసం ఎదురు చూస్తూ ఆఫీస్ మెయిన్ గేట్ దగ్గరే నుంచున్నారు మేనేజర్. కోట గారు రాగానే.. ‘ఏమండీ శ్రీనివాసరావు గారు, మీరు ఇక క్యాష్‌ డిపార్ట్‌మెంట్‌ వదిలేయండి. మిమ్మల్ని చూడటానికి విపరీతంగా జనం రావడం, దాంతో మా పని కూడా మధ్యలోనే ఆగిపోతుంది.

కాబట్టి మీరు ఉద్యోగం మానేయండి. మీరు సినిమాల్లో తప్పకుండా రాణిస్తారు. మీకు మళ్ళీ ఉద్యోగంలో చేరే అవసరం రాదు’ అంటూ ఆయన చెప్పిన మాటలు వినే, కోట జాబ్ మానేసి పూర్తిగా సినిమాల్లోకి వచ్చారు. దాంతో కోట గారికి మరిన్ని సినిమాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఆయనకు నలభై ఏళ్ళ పాటు తిరుగులేకుండా పోయింది.

Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ

Tags

    follow us