Karan Dewan: భారతదేశపు మొదటి బాక్సాఫీస్ సూపర్ స్టార్ …కానీ చివరిగా కాస్టింగ్ ఏజెంట్ గా మరణించారు
కరణ్ దేవాన్ తన 40వ దశకంలోకి అడుగుపెట్టినప్పుడు, మారుతున్న హిందీ సినిమా పద్ధతిని తాను స్వీకరించలేకపోయారు. దిలీప్ కుమార్ , రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ వంటి యువ నటులు మారుతున్న సినిమాని బట్టి వారు మారి ఇప్పుడు పెద్ద స్టార్స్ గా పేరు తెచ్చుకున్నారు.

Karan Dewan: భారతదేశపు మొదటి సూపర్ స్టార్ అనే బిరుదు రాజేష్ ఖన్నాకు కు వచ్చింది అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే 1940, 50 లలో గొప్ప బాక్సాఫీస్ విజయాలు సాధించిన దిలీప్ కుమార్, అశోక్ కుమార్ లు అతని కంటే ముందు సూపర్ స్టార్లు అని పలుమార్లు డిబేట్ జరుగుతూ వచ్చింది . అయితే, ఈ సూపర్ స్టార్ బిరుదు మొదటిగా ఎవరికి ఇచ్చిండాలి అని చర్చలో తరచుగా మరచిపోయే పేరు ఒకటి ఉంది. ఆ వ్యక్తి నిస్సందేహంగా బాలీవుడ్ మొదటి బాక్సాఫీస్ కింగ్. అయినప్పటికీ, అతని జీవితం ఎంతో విషాదకరంగా సాగింది, అలానే ఆయన సూపర్ స్టార్ పేరుకి అసలైన వారసుడు అని కూడా చాలామంది మర్చిపోయారు.
ఆయన మరెవరో కాదు భారతీయ సినీ ప్రపంచంలో అనేక హిట్లు సాధించి తన నటన తో అందరినీ ఆశ్చర్యపరిచిన కరణ్ దేవాన్. 1939లో పురాణ్ భగత్‌తో రంగప్రవేశం చేసిన ఈ పంజాబీ నటుడు 1942లో తమన్నా అనే సినిమాతో హిందీ వారికి కూడా పరిచయమయ్యారు. కానీ 1944లో వచ్చిన రత్తన్ చిత్రంతో అతను స్టార్‌డమ్‌ని పొందాడు.
ఈ చిత్రం ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం గా నిలిచింది. అంతేకాకుండా ఈ 27 ఏళ్ల యువకుడిని పరిశ్రమలో అగ్ర హీరోగా నిలబెట్టింది. 40లు, 50లలో, జీనత్, దునియా, అర్జూ, పర్దేస్, బహార్ అనేక ఇతర విజయవంతమైన చిత్రాలలో కనిపించిన దేవాన్ బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు. ఆ సమయంలో, అతను 20 సిల్వర్ జూబ్లీ హిట్‌లను అందించాడు. అలానే జూబ్లీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.
కానీ కరణ్ దేవాన్ తన 40వ దశకంలోకి అడుగుపెట్టినప్పుడు, మారుతున్న హిందీ సినిమా పద్ధతిని తాను స్వీకరించలేకపోయారు. దిలీప్ కుమార్ , రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ వంటి యువ నటులు మారుతున్న సినిమాని బట్టి వారు మారి ఇప్పుడు పెద్ద స్టార్స్ గా పేరు తెచ్చుకున్నారు. మరోపక్క కరణ్ కి అప్పట్లో పోటిగా ఉన్న అశోక్ కుమార్ క్యారెక్టర్ పాత్రలకు మారాడు. అయితే కరెంట్ మాత్రం అలా చేయలేదు.
ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ తనకు హీరోగా పాత్రలు రావు అని గమనించిన కరణ్ చివరిగా 60వ దశకంలో అప్నా ఘర్, షహీద్, ఆమ్నే సామ్నే వంటి చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు, కానీ ఆ సినిమాల ద్వారా ఆయన పెద్దగా గుర్తించబడలేదు. ఇక 1966 నాటికి, స్థిరమైన పని లేకపోవడంతో, అతను మాయ వంటి చిత్రాలకు కాస్టింగ్ ఏజెంట్‌గా పనిచేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఆ తర్వాత రమేష్ సిప్పీ యొక్క సీతా ఔర్ గీతా మరియు యష్ చోప్రా యొక్క దాగ్ లాంటి ఎన్నో చైనా చిత్రాలలో నటించారు. అతని చివరి విడుదల 1979లో ఆత్మారామ్ సినిమా.
1979లో, దివాన్ తన 62వ ఏట ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. అతని మరణం తర్వాత హిందీ ప్రేక్షకులు ఆయన్ని మరచిపోయినప్పటికీ, ఎక్కువ జూబ్లీహిల్స్ అచ్చులు చేసిన సినిమాలు చేసిన హీరో మాత్రం ఈయనే. అయితే రోజులు కరిచేకొద్దీ ఆ తరువాత జూబ్లీ స్టార్ అనే ఈ ట్యాగ్ 60వ దశకంలో కొన్ని బ్యాక్ టు బ్యాక్ సిల్వర్ జూబ్లీ హిట్‌లను ఇచ్చిన రాజేంద్ర కుమార్ కి సొంతమయింది.
