Kamal Haasan: సరే.. సరే.. కమల్ హాసన్ వ్యక్తిగత జీవితం మనకు అనవసరం.. కానీ అతను సినిమా నటుడు. అంత మాత్రమే కాదు.. మక్కల్ నీది మయ్యం అనే పార్టీకి నాయకుడు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి అనుకొని బొక్కా బోర్లా పడ్డాడు.. ప్రజా జీవితంలో ఉన్నాడు. కాబట్టి అతడి సంబంధాల్లో దాపరికం ఉండకూడదు. తాజాగా 45 సంవత్సరాల తన సహజీవని పూజా కుమార్ తో కూడా 68 సంవత్సరాల ఉలగ నాయగన్ తెగదెంపులు చేసుకున్నాడని ఇప్పుడు చర్చ జరుగుతోంది.. ఫిలిం సర్కిల్లో వినిపిస్తోంది.. ఆ మాటకు వస్తే అతడు నిజంగా మైకేల్ మదన కామరాజు.. నిత్య గ్రంధ సాంగుడు.. అతడు ఏ బంధాన్ని చిక్కబడనిచ్చాడని? వచ్చే వారు వస్తూ ఉంటారు.. పోయేవాళ్ళు పోతూ ఉంటారు.. అతడు ఏం బాధపడడు.. స్వేచ్ఛావిహంగం లాగా ఎగురుతూనే ఉంటాడు. అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.

Pooja Kumar- Kamal Haasan
కెరియర్ తొలినాళ్లలో
కమల్ హాసన్ తన కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లల్లో శ్రీవిద్య అనే నటి మణి తో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగాడు.. తర్వాత ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు.. పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయానికి విడిపోయారు.. ఆ తర్వాత వాణి గణపతి అనే క్లాసికల్ డాన్సర్ కు కమల్ దగ్గరయ్యాడు.. వయసులో పెద్దయినప్పటికీ వారి బంధానికి అది అడ్డు కాలేదు. ఇద్దరు ఏకాంతంగా గడిపేవారు.. ఇలా కొద్దిరోజులు అయిన తర్వాత ఈ బంధానికి బీటలు పడ్డాయి. అనంతరం అతడి జీవితంలోకి సారిక వచ్చింది. రెండు బంధాలకు బీటలు వారాయనే బాధనో, మరి ఏమిటో తెలియదు కానీ… సారికను కమల్ ఓన్ చేసుకున్నాడు. పెళ్లి కాకముందే సారిక గర్భం దాల్చింది. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.. శృతిహాసన్ పుట్టింది.. తర్వాత అక్షర హాసన్ జన్మించింది.. ఇక్కడిదాకా బాగానే ఉంటే అంతా సవ్యంగానే ఉండేది.

Kamal Haasan- Sarika
బ్రహ్మచారి సినిమాతో
అప్పట్లో సిమ్రాన్ దక్షిణాది సినిమాను ఊపేస్తున్న రోజులవి. అయితే అప్పట్లో కమల్ హాసన్ కు వరుస ప్లాపులు వచ్చాయి.. దీంతో బ్రహ్మచారి అనే సినిమాని మొదలు పెట్టాడు.. అందులో సిమ్రాన్ హీరోయిన్. ముందే చెప్పుకున్నాం కదా కమల్ హాసన్ ఒక గ్రంథ సాంగుడని… సిమ్రాన్ కు దగ్గర అయ్యాడు. ఇది సారికకు తెలిసింది.. ఏముంది వివాహ బంధం పెటాకులైంది.. తర్వాత ఏమైందో తెలియదు గానీ సిమ్రాన్ కూడా దూరంగా వెళ్లిపోయింది.. ఇలా కొద్ది రోజులు ఒంటరిగా ఉన్న కమల్ హాసన్ జీవితంలోకి ఈసారి గౌతమి వచ్చింది.. సుదీర్ఘంగా సహజీవనం చేశారు.. ఆమె మొదటి సంసార జీవితం కూడా పెటాకులైన బాపతే. ఆమెకు ఒక కూతురు ఉంది.. పేరు లక్ష్మి.. కానీ ఈ బంధం కూడా స్థిరంగా నిలబడలేదు.. ఇందుకు కారణం కమల్ హాసన్ వైఖరే అని అంటారు.. తర్వాత గౌతమి తన దారి తను చూసుకుంది. ఇంతలో క్యాన్సర్ అటాక్ కావడంతో గట్టిగా పోరాడింది.. ఇప్పుడు క్యాన్సర్ విజేత గా మారి తోటి క్యాన్సర్ రోగుల్లో ధైర్యాన్ని నింపుతోంది.

Pooja Kumar Kamal Haasan
పూజ కుమార్ వచ్చింది
ఆ మధ్య విశ్వరూపం అనే సినిమా కమల్ హాసన్ లో మరో కొత్త నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాతో పూజ కుమార్ అనే నటి కమల్ హాసన్ కి కూడా పరిచయం అయింది.. ఆమె కూడా ఇతడి బాపతే.. ఇంకేముంది చూపులు చూపులు కలిసాయి. సీన్ కట్ చేస్తే సహజీవనం. ఇలా విశ్వరూపం 2 లో కూడా ఆమె నటించింది.. గరుడవేగ, హిందీలో కొన్ని సినిమాల్లో పూజ కుమార్ కనిపించింది. రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కదా… కమల్ హాసన్ ఏ బంధాన్ని కూడా చిక్కబడనివ్వడు. అంత త్వరగా అంత త్వరగా చిక్కడు. ఆ మధ్య పూజ కుమార్ తో కుటుంబంతో కలిసి ఫోటో దిగితే పెళ్లి చేసుకున్నాడు కాబోలు అనుకున్నారు. కాలం గడిస్తే కానీ అసలు విషయం బోధపడలేదు. పూజ కుమార్ కూడా కమల్ జీవితంలో నుంచి వెళ్లిపోయింది. ముందే అనుకున్నాం కదా అతడు ఒక స్వేచ్ఛా విహంగం. వచ్చేవారు వస్తూ ఉంటారు. పోయేవాళ్లు పోతుంటారు.. అతడు బాధపడడు.. భంగ పడడు. కమల్ ను ఆదర్శంగా తీసుకున్నదేమో… ఆయన పెద్ద కూతురు మొదటి ప్రేమ భగ్నమైంది. రెండో ప్రేమ కొద్ది కాలానికి విడిపోయింది.. మూడో ప్రేమ సహజీవనం ద్వారా సాగుతోంది. అది కూడా ఏమవుతుందో కాలం గడిస్తే గాని చెప్పలేం.