Isha Ambani Car: రంగులు మార్చే కారు.. ఇదీ అంబానీ కూతురి కారు మరీ..
ఇషా అంబానీ ఇటీవల తెగ వైరల్ అవుతున్నారు. తండ్రి పంచిన ఆస్తులే కాకుండా సొంతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె లగ్జరీ లైఫ్ ను కూడా మెయింటేన్ చేస్తున్నారు.

Isha Ambani Car: SUV కార్ల గురించి తెలుసు..హ్యాచ్ బ్యాక్ కార్ల గురించి తెలుసు.. కానీ కార్లు రంగులు మారుతాయన్న విషయం తెలుసా? కారు కొనుగోలు చేసేటప్పుడు ముందే మనకు నచ్చిన రంగును సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తరువాత రంగు మార్చాలనుకున్నా సాధ్యం కాదు. ఒకవేళ మార్చినా ఒరిజినల్ కు ఉన్న లుక్ ఉండదు. అయితే ఓ కారు మాత్రం ఒకే కలర్ లో కాకుండా వివిధ రంగుల్లో మారుతూ ఉంటుంది. ఎండకు, వానకు వాతావరణాన్ని భట్టి కొత్త కొత్త కలర్లో వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి కారు సామాన్యుల వద్ద ఉంటుందా? అందుకే అపభ కుభేర కుటుంబానికి చెందిన ఇషా అంబానీ ఇందులో కనిపించింది.ఇటీవల ముంబై రోడ్లపై రంగులు మారుతున్న ఓ కారులో ఇషా అంబానీ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఆ కారు గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ కారు అలా రంగులు మారడానికి కారణమేంటంటే? దాని ధర ఎంత?
ఇషా అంబానీ ఇటీవల తెగ వైరల్ అవుతున్నారు. తండ్రి పంచిన ఆస్తులే కాకుండా సొంతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె లగ్జరీ లైఫ్ ను కూడా మెయింటేన్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన వస్తువులు ఖరీదైనవి ఉంటున్నాయి. ఇటీవల ఇషా అంబానీ రంగులు మారే కారులో ప్రయాణించారు. ఈ కారు రోల్స్ రాయస్ కంపెనీకి చెందినది. దీని పేరు కల్లినస్ గా తెలుస్తోంది. ఈ ఈకారు 6.8 లీటర్ V12 ట్విన్ టర్బో చార్జ్ ను కలిగి ఉంది. పెట్రోల్ ఇంజిన్ తో నడిచే ఈ మోడల్ గరిష్టంగా 580 బీహెచ్ పీ పవర్ ఉంటుంది. 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది.
అయితే ఈ కారు మిగతా వాటికంటే ప్రత్యేకమైంది. వాతావరణాన్ని భట్టి ఇది రంగులు మారుతూ ఉంటుంది. దీనిని దూరం నుంచి చూస్తే వైట్ లో కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లే సరికి బ్లూ కలర్ లోకి మారుతుంది. ఇటీవల వర్షం కురిసిన సమయంలో సాధారణంగానే కనిపించింది. కానీ ఎండ సమయంలో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారుపై పడే సూర్యకాంతితో ఇది మన కళ్లకు రంగులు మారినట్లు కనిపిస్తుంది. ఫోర్స్చే 911 జీటీ 3, టయోటా సుప్రా వంటికార్లతో కలిపి దీనిని బీ లైక్ ఓమ్ అనే యూట్యబ్ అప్లోడ్ చేశారు. దీని ధర రూ. 10 కోట్లు ఉందని సమాచారం.
ముఖేష్ అంబానీ వద్ద ఇప్పటికే ప్రసిద్ధి చెందిన బీఎం డబ్ల్యూ ఐ8, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, మెక్ లారెన్ 520 ఎస్ స్సైడర్ వంటి కార్లు ఉన్నాయి. వీటి సరసన రోల్స్ రాయిస్ ను కూడా చేర్చారు. దీంతో ఈ కారు గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కారు కొందరి వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రంగులు మారే ఈ కారు వీడియోను చూసి చాలా మంది రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
