Gadar 2: గదర్ 2…బోర్డర్ దాటి మరో పోరుకు సిద్ధమవుతున్న తారా సింగ్….
గదర్ స్టోరీ బుటా సింగ్ అనే వ్యక్తి కథ ఆధారంగా డెవలప్ చేశారు. 2001లో విడుదలైన గదర్ అమీర్ ఖాన్ లగాన్ తో పోటీగా బాక్స్ ఆఫీస్ వద్ద తలపడింది. ఏ మూవీలో అమీషా పటేల్ బదులు మొదట కాజోల్ ని అనుకున్నారు.

Gadar 2: 2001లో విడుదలైన గదర్ చిత్రం ఎటువంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రం వెనుక చాలామందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఉంది. లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తో ఈ చిత్రానికి డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ శర్మ కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తో ఒక చిత్రాన్ని ఆల్రెడీ కమిట్ అయ్యారు. అయితే గదర్ మూవీ చేయడం కోసం ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
ఈ క్రమంలో దిలీప్ కుమార్ కు ఆయన ప్రత్యేకంగా అపాలజీ చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో అనిల్ శర్మ గదర్ చిత్రీకరణ సమయంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఒక పీరియాడిక్ మూవీ తీయాలి అన్న ఆసక్తితో అనిల్ శర్మ మొదట దిలీప్ కుమార్ ను కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తో ఒక స్టోరీ సెట్ చేసి అప్రోచ్ అయ్యారు. కాశ్మీర్లో హిందువులు అనుభవిస్తున్నటువంటి పలు రకాల పరిస్థితుల ఆధారంగా రూపొందిన ఆ కథ నచ్చడంతో దిలీప్ కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ స్టోరీ డెవలప్ చేసే నేపథ్యంలో అనుకోకుండా అనిల్ తన రైటర్ తో చిత్రంలో ఒక రొమాంటిక్ సబ్ ప్లాట్ కావాలి అన్నప్పుడు…అతను చెప్పిన స్టోరీ అనిల్ కు బాగా నచ్చింది. కాశ్మీర్ కు చెందిన ఒక అబ్బాయిని బోర్డర్ క్రాస్ చేసి వచ్చిన ఒక అమ్మాయి ఇష్టపడుతుంది.. ఇక ఈ స్టోరీ పై సినిమా చేయడానికి అనిల్ ఫిక్స్ అయ్యారు. కానీ అప్పటికే మూవీకి సంబంధించిన యాక్టర్స్ మరియు నరేష్ అన్ని ఫిక్స్ అయిపోయాయి. కానీ ఎలాగైనా గదర్ చిత్రాన్ని తరకెక్కించాలి అని భావించిన అనిల్ శర్మ పర్సనల్ గా ముందు అనుకున్న మూవీకి సంబంధించిన వ్యక్తులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
గదర్ స్టోరీ బుటా సింగ్ అనే వ్యక్తి కథ ఆధారంగా డెవలప్ చేశారు. 2001లో విడుదలైన గదర్ అమీర్ ఖాన్ లగాన్ తో పోటీగా బాక్స్ ఆఫీస్ వద్ద తలపడింది. ఏ మూవీలో అమీషా పటేల్ బదులు మొదట కాజోల్ ని అనుకున్నారు.. కానీ అప్పుడు కాజోల్ కాల్ షీట్స్ ఖాళీగా లేవు…దీంతో గదర్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ అమీషా పటేల్ కు దక్కింది. కాజోల్ మాత్రం తన కెరీర్లో ఓ మంచి హిట్ ని వదులుకుంది.గదర్: ఏక్ ప్రేమ్ కథకు సీక్వెల్ గా గదర్ రెబెల్లియన్ 2 త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కూడా అమీషా పటేల్ , సన్నీడియోల్ మెయిన్ లీడ్స్ లో కనిపించనున్నారు.
