Chiranjeevi Marriage: చిరిగిన చొక్కాతో సురేఖను పెళ్లి చేసుకున్న చిరంజీవి.. కారణం ఇదే..

దశాబ్దాలుగా ఆడియన్స్ ను అలరిస్తున్న స్టార్లలో మెగాస్టార్ ఒకరు. 1978లో పునాది రాళ్లు అనే సినిమాతో హీరో అయ్యాడు. అక్కడి నుంచి చిరంజీవికి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆయన బిజీ హీరోగా మారిపోయాడు.

  • Written By: Chai Muchhata
  • Published On:
Chiranjeevi Marriage: చిరిగిన చొక్కాతో సురేఖను పెళ్లి చేసుకున్న చిరంజీవి.. కారణం ఇదే..

Chiranjeevi Marriage: కష్టే ఫలి అన్నారు.. ప్రతీ కష్టానికి ఓ ఫలితం ఉటుంది. అయితే దానికో సమయం రావాలి.. ఈ వ్యాఖ్యం సినిమా వాళ్లకు బాగా యూజ్ అవుతుంది.. కొందరి జీవితంలో నిజమైంది కూడా. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న చాలా మంది ఎదో ఒక బ్యాగ్రౌండ్ తో వచ్చిన వాళ్లే. కానీ ఎలాంటి అండాదండా లేకుండా వచ్చిన వాళ్లలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతారు. శివశంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన మెగా హీరో వరకు ఎదిగారు. అయితే ఈ హీరో మెగా పొజిషన్ వరకు రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు.. ఇబ్బందులు పడ్డాడు.. చివరికి ఆయన పెళ్లిలో కూడా కష్టాలను ఎదుర్కొన్నారు. అసలేం జరిగిందంటే?

దశాబ్దాలుగా ఆడియన్స్ ను అలరిస్తున్న స్టార్లలో మెగాస్టార్ ఒకరు. 1978లో పునాది రాళ్లు అనే సినిమాతో హీరో అయ్యాడు. అక్కడి నుంచి చిరంజీవికి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆయన బిజీ హీరోగా మారిపోయాడు. ఆ సమయంలో చిరంజీవి పారితోషికం రూ.1,116 రూపాయలు. ఇక 1980లో ఆయన బివి ప్రసాద్ డైరెక్షన్లో వచ్చిన ‘తాతయ్య ప్రేమలేఖలు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నూతన్ ప్రసాద్ తో పాటు దీప, సీమ నటించారు. కౌముది పిక్చర్స్ పై వచ్చన ఈ మూవీ అందరినీ అలరించింది.

ఈ సినిమా చేస్తున్న సమయంలోనే అంటే 1980 ఫిబ్రవరి 20న చిరంజీవికి సురేఖతో పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. అయితే 1980 సంవత్సరంలో చిరంజీవి ఏకంగా 14 సినిమాల్లో నటించారు. దీంతో ఆయన బిజీ లైఫ్ ను గడిపారు. అయితే తన పెళ్లి మూహుర్తం రోజున కూడా చిరంజీవి ‘తాతయ్య ప్రేమలేఖలు’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన చొక్కా చిరిగింది. అయితే పెళ్లికి సమయం దగ్గరపడుతుండడంతో వేరే చొక్కాను మార్చుకునే సమయం లేక వెంటనే ఆదే చొక్కాతో పెళ్లి మండపానికి వచ్చారు.అయితే ఇక్కడ ఆ చొక్కాను కవర్ చేయడానికి మీద కండువా వేసుకున్నారు.

ఇవే కాకుండా చీరంజీవి లైఫ్ లో ఎన్నో ఆవాంతరాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఇలా 150కి పైగా చిత్రాల్లో నటించిన మెగా హీరో అయ్యారు. ఇప్పటికీ నేటి కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ అలరిస్తున్నాడు. ఇక చిరంజీవి-సురేఖల పెళ్లి పత్రిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో పెళ్లి పత్రికను ముద్రించిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు