Chatrapathi Chandrasekhar Wife: ఛత్రపతి చంద్రశేఖర్ భార్య ఓ బ్యూటిఫుల్ యాక్ట్రెస్.. మీకు బాగా తెలిసిన అమ్మాయే!
బాహుబలిలో కూడా చంద్రశేఖర్ పాత్ర ఉందట. ఆ పాత్రను కొన్ని అనివార్య కారణాలతో తొలగించారట. చంద్రశేఖర్ కి కూడా నచ్చకపోవడంతో ఓకే తొలగించండి అన్నారట.

Chatrapathi Chandrasekhar Wife: దర్శకుడు రాజమౌళి తన టీమ్ ని మార్చడానికి ఇష్టపడరు. సాంకేతిక నిపుణులు, నటులను రిపీట్ చేశారు. హీరోల విషయంలో కూడా అంతే. చేసిన హీరోలతోనే మూడు నాలుగు సినిమాలు చేసిన రాజమౌళి కొందరు హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాగే యాక్టర్ చంద్రశేఖర్ రాజమౌళి ప్రతి సినిమాలో ఉంటారు. రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఆర్ ఆర్ ఆర్ వరకు అన్ని చిత్రాల్లో చంద్రశేఖర్ ఉన్నారు. ఒక్క బాహుబలి మాత్రం లేరు.
బాహుబలిలో కూడా చంద్రశేఖర్ పాత్ర ఉందట. ఆ పాత్రను కొన్ని అనివార్య కారణాలతో తొలగించారట. చంద్రశేఖర్ కి కూడా నచ్చకపోవడంతో ఓకే తొలగించండి అన్నారట. అలా చంద్రశేఖర్ కి బాహుబలి చిత్రంలో ఆఫర్ మిస్ అయ్యింది. ఇక చంద్రశేఖర్ ని నటుడిగా నిలబెట్టింది రాజమౌళి చిత్రాలే. ఛత్రపతి మూవీలో హీరో ఫ్రెండ్ గా భద్రం పాత్రలో చంద్రశేఖర్ మెప్పించాడు. ఆ సినిమాతో ఛత్రపతి చంద్రశేఖర్ గా సెటిల్ అయ్యారు.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… చంద్రశేఖర్ భార్య కూడా ఓ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆమె చాలా సినిమాలు, సీరియల్స్ లో నటించారు. ఆమె పేరు నీల్యా భవాని. కిక్ 2, సైరా, కృష్ణార్జున యుద్ధం, పండగ చేస్కో ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అందంగా ఉండే నీల్యా భవాని స్టైలిష్ క్యారెక్టర్ రోల్స్ కి బాగా సెట్ అవుతారు. చంద్రశేఖర్-నీల్యా భవానికి చాలా కాలంగా పరిచయం ఉందట. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు.
ఇక రాజమౌళి లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో కూడా చంద్రశేఖర్ నటించారు. కొమరం భీమ్ తో పాటు ఢిల్లీకి మల్లి కోసం వచ్చే గోండు జాతి వ్యక్తి పాత్ర చేశాడు. ఆర్ ఆర్ ఆర్ లో చంద్రశేఖర్ కి మంచి పాత్ర దక్కింది. గతంతో పోల్చితే చంద్రశేఖర్ పెద్దగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు. ఆయన హవా తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి.
