Carlos Alcaraz Wimbledon 2023: వింబుల్డన్ లో దున్నేస్తున్నాడు.. ఎవరీ కార్లోస్ అల్కరాజ్..!

బెరెట్టీపై సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న అల్కరాజ్.. ఈ పోరులో బలమైన ఆరో సీడ్ హోల్గర్ రూన్ తో తలపడనున్నాడు. కూడా 2017 నిట్టో ఏటీపీ ఫైనాన్స్ ఛాంపియన్ గ్రిగర్ దిమిత్రోవ్ ను నాలుగు సెట్లలో ఓడించి విజయం సాధించాడు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ లో తలపడుతుండడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు.

  • Written By: BS
  • Published On:
Carlos Alcaraz Wimbledon 2023: వింబుల్డన్ లో దున్నేస్తున్నాడు.. ఎవరీ కార్లోస్ అల్కరాజ్..!

Carlos Alcaraz Wimbledon 2023: కార్లోస్ అల్కరాజ్.. ఇప్పుడు ఈ పేరు వింబుల్డన్ లో మార్మోగిపోతోంది. వరుస విజయాలు, ఉరిమే ఉత్సాహంతో ఒకప్పటి నాదల్ ను తలపిస్తున్నాడు. 20 ఏళ్ల వయసులోనే గ్రాస్ కోర్టును దున్నేస్తున్నాడు. హేమాహేమీలను కూడా మట్టికరిపిస్తూ వింబుల్డన్ లో సరికొత్త సంచలనంగా మారాడు. అద్భుతమైన ఆట తీరు, అంతకుమించిన టెక్నిక్ అభిమానులను అలరిస్తున్న కార్లోస్ ఆల్కరాజ్ ఎవరా అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. అల్కరాజ్ ఆట తీరు చూస్తుంటే.. వింబుల్డన్ లో సెన్సేషన్ క్రియేట్ అవుతుందా..? విజేతగా ఈ యంగ్ గన్ నిలుస్తుందా..? అన్న ప్రశ్నలు అభిమానుల మధ్యలో మెదులుతున్నాయి.

ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్లో స్పెయిన్ కు చెందిన కార్లోస్ అల్కరాజ్ అదరగొడుతున్నాడు. సోమవారం జరిగిన పోరులో రెండేళ్ల క్రితం ఫైనలిస్ట్ అయిన మాటియో బెరెట్టీని ఓడించడం ద్వారా తొలిసారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.
గ్రాస్ కోర్టులో గత కొన్నాళ్లుగా అదరగొడుతున్న బెరెట్టీని.. అద్భుతమైన ఆటతీరుతో మట్టి కరిపించాడు. 3-6, 6-3, 6-3, 6-3 తేడాతో విజయం సాధించి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. మొదటి సెట్ లో ఇబ్బంది పడిన అల్కరాజ్.. సెంటర్ కోర్టులో తన రిటర్న్ రిథమ్ ను అందుకున్న తర్వాత మూడు గంటల నాలుగు నిమిషాల్లో విజయాన్ని అందుకున్నాడు. చివరి మూడు సెట్లలో వరుసగా 6-3 తేడాతో విజయాన్ని నమోదు చేసి సత్తాను చాటాడు.

బెరెట్టీపై సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న అల్కరాజ్.. ఈ పోరులో బలమైన ఆరో సీడ్ హోల్గర్ రూన్ తో తలపడనున్నాడు. కూడా 2017 నిట్టో ఏటీపీ ఫైనాన్స్ ఛాంపియన్ గ్రిగర్ దిమిత్రోవ్ ను నాలుగు సెట్లలో ఓడించి విజయం సాధించాడు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ లో తలపడుతుండడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పోరును ఒక రకంగా చెప్పాలంటే తరువాత జనరేషన్ వార్ గా పలువురు పేర్కొంటున్నారు. హాల్గర్ తో క్వార్టర్ ఫైనల్స్ లో ఆడడంపై స్పందించిన అల్కరాజ్.. క్వార్టర్ ఫైనల్ ఆడడం టెన్నిస్లో గొప్ప విషయమని, హోల్గర్ తో ఆడడాన్ని తాను ఎంజాయ్ చేస్తానని స్పష్టం చేశాడు. 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నుంచి తామిద్దరం అనేక టోర్నమెంట్లో ఆడామని, ఇద్దరం ఒకే సమయంలో ఎదుగుతూ వచ్చామని, అనేక కేటగిరీల్లో ఉత్తీర్ణత సాధించామని అల్కరాజ్ స్పష్టం చేశాడు. గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్ లో హోల్గర్ తో ఆడడం గొప్పగా ఉంటుందని, అదే సమయంలో తాను ఎంజాయ్ చేస్తానని వెల్లడించాడు.

విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన అల్కరాజ్..

గ్రాస్ కోర్టులో సత్తా చాటే బెరైట్టీని ఓడించిన తర్వాత మాట్లాడిన అల్కరాజ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తను అద్భుతంగా ఆడుతాడని తనకు తెలుసని, తాను తొలి షర్టు కోల్పోయిన తర్వాత విజయం సాధించడం అంత సులభం కాదని అర్థమైందని వివరించాడు. కాకపోతే అవకాశాలు లభిస్తాయని తెలుసు కాబట్టి ఓపికతో ఉన్నానని, ఏకాగ్రతతో ఉండాలని నిర్ణయించుకుని తదుపరి సెట్లు ఆడి విజయం సాధించినట్లు వెల్లడించాడు. 20 ఏళ్ల అల్కరాజ్ ఇప్పటి వరకు గ్రాస్ కోర్టులో ఆరు టూర్ లెవెల్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. కానీ క్వీన్స్ క్లబ్ ఛాంపియన్ షిప్ లో ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లో విజయాలు సాధించాడు. అలాగే వింబుల్డన్ లో ఇప్పటి వరకు మూడు విజయాలను సాధించాడు. విజయానంతరం మరిన్ని విషయాలపై మాట్లాడిన అల్కరాజ్.. తాను మరింత ఆకలిగా ఉన్నానని, గ తేడాది తన నాలుగు వారంలో ఓడిపోయానని, ఈ ఏడాది మాత్రం క్వార్టర్ ఫైనల్స్ లో ఆడాలని బలంగా కోరుకున్నట్లు వివరించాడు. అందుకు అనుగుణంగానే సాధించానని, కానీ ఇప్పుడు మరింత ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో ఉన్నట్లు స్పష్టం చేశాడు. ఇక్కడ ఫైనల్ ఆడి ఏదో ఒక రోజు టైటిల్ గెలవాలన్నదే తన కల అని వివరించాడు అల్కరాజ్.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube