Allu Bobby: అల్లు వారి ఇంట్లో ఇంకా సెటిల్ కానీ వ్యక్తా? అది కూడా పెద్ద కుమారుడు?

టాలీవుడ్ లెజెండ్ అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే.అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.

  • Written By: Suresh
  • Published On:
Allu Bobby: అల్లు వారి ఇంట్లో ఇంకా సెటిల్ కానీ వ్యక్తా? అది కూడా పెద్ద కుమారుడు?

Allu Bobby: ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు బాగుపడుతారని చెప్పడం కష్టం. ఒకరు వ్యాపారం, మరొకరు చదువులు, మరొకరు విదేశాలు, లేదా ఏం చేయకుండా గాలి తిరుగుల్లు తిరిగే వారు కూడా ఉంటారు. కెరీర్ ఎలా సాగించాలో తెలుసుకొని ఒకప్లాన్ తో వెళ్లే పిల్లలపై ఏ తల్లిదండ్రికి టెన్షన్ ఉండదు. కానీ ఏం చేయకుండా ప్రతీది చేస్తూ నష్టాలు చవి చూసుకుంటూ.. సెటిల్ కానీ పిల్లలపై తల్లిదండ్రికి ఎప్పుడూ టెన్షనే. అయితే ఈ బాధ అందరికీ ఉంటుంది. రైతు నుంచి కలెక్టర్ వరకు, డాన్ నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది. అయితే అల్లు అరవింద్ కు కూడా ఇంట్లో కెరీర్ సెట్ కానీ ఒక కుమారుడు ఉన్నారు. ఏది చేసినా విజయం సాధించకనో.. లేక ప్రణాళిక సరిగ్గా లేకనో కానీ ఇంక సరిగ్గా సెటిల్ కాలేదట ఆ కుమారుడు. మిగిలిన ఇద్దరు ఫర్వెక్ట్ అయితే మరొకరు మాత్రం కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ఎవరా కుమారుడు ఎందుకు సెటిల్ కాలేదు అనే వివరాలు మీకోసం.

టాలీవుడ్ లెజెండ్ అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే.అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.వారిలో అల్లు అర్జున్ పాన్‌ ఇండియా స్టార్ హీరో గా ఇప్పటికే గుర్తింపుకు దక్కించుకుని దూసుకు పోతున్నాడు.మరో వైపు అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరో గా సక్సెస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు.ఈ సమయం లోనే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ ఏం చేస్తాడు అంటూ అల్లు వారి ఫ్యామిలీ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు బాబీ విషయానికి వస్తే ఆయన మొదట సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు.

వ్యాపారాలు చేసుకుంటూ ఇండస్ట్రీ కి దూరంగా ఉండడంతో ఆయన ని ఇండస్ట్రీ లో చాలా మంది గుర్తు పట్టారు.ఈ మధ్య కాలం లోనే నిర్మాతగా ‘గని‘ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకుంది.అల్లు బాబీ మొదటి సినిమా తోనే నిర్మాతగా నిరాశ పడడంతో తదుపరి సినిమా విషయం లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తన తండ్రి నిర్వహిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కాకుండా సొంత నిర్మాణ సంస్థ తో సినిమాలు చేయాలని భావించిన అల్లు బాబీ కి మొదటి లోనే షాక్ తగిలింది.ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తాడా లేదంటే ఒక సినిమా తోనే ఆగిపోతాడా అనేది చూడాలి.ఏ నిర్మాతకైనా, నటుడికైనా, హీరోకైనా, దర్శకుడు కైనా మొదటి సినిమా సక్సెస్ అయితే ఆ తర్వాత కెరియర్ బాగుంటుంది.కానీ ఇప్పుడు అల్లు బాబీ కెరీర్ నిర్మాతగా ఎలా ఉంటుందో చూడాలి.

అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇప్పటికే కెరీర్ లో మంచి సక్సెస్ సాధించారు. అల్లు అర్జున్ లా కాకపోయినా అల్లు శిరీష్ కూడా మంచి ఫాం లోనే ఉన్నాడు. కానీ బాబీ మాత్రం ఇంక సక్సెస్ ట్రాక్ ఎక్కలేదు అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఒకే ఒక్క సినిమా హిట్ తో ఆయన ఖాతాలో వచ్చి చేరితే సక్సెస్ వైపు అడుగులు వేయడమే కాదు.. మరెన్నో మంచి సినిమాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది అంటున్నారు పలువురు. ఒక్క హిట్ వస్తే చాలు అని ఎదురుచూస్తున్నారు చాలా మంది. మరి ముందు ముందు బాబీ ఏం చేస్తారో చూడాలి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు